• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

సార్ యాదిలో: ప్రజల హృదయాల్లో జయశంకర్ సార్: సీఎం కేసీఆర్

|

ప్రొఫెసర్ జయశంకర్‌ను సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ నెల 6వ తేదీ శుక్రవారం జయశంకర్ సార్ జయంతి.. ఈ సందర్భంగా ఉద్యమ సహచరుడిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో ప్రొఫెసర్ జయశంకర్ చిరస్థాయిగా నిలిచిపోతారని కేసీఆర్ అభిలాసించారు. తెలంగాణ ఉద్యమం కోసం, ఉద్యమ భావజాల ప్రసరణ కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుడు జయశంకర్ అని కీర్తించారు.

జయశంకర్ కలలుగన్న తెలంగాణ కోసమే తాము పనిచేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. ఆయన ఆశయాలను వరుసగా నెరవేర్చుతున్నామని చెప్పుకొచ్చారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే ప్రత్యేక తెలంగాణ అని చాటిన వ్యక్తి జయశంకర్ అని కొనియాడారు. ఈ దిశగా బంగారు తెలంగాణ కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్ పేరుగడించారు. వరంగల్ జిల్లా, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామశివారు అక్కంపేటలో ఆయన జన్మించారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి.. ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు చేపట్టారు. 1969 తెలంగాణ ఉద్యమంలో, అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమంలో సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు.

 kcr remember prof jayashankar sir

టీఆర్ఎస్ ఏర్పాటులో కే చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ 2011 జూన్ 21న ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. ఆయన మరణం తెలంగాణ జాతికి తీరని లోటు అని చాలా మంది నిపుణులు, మేధావులు అంటుంటారు.

1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు జయశంకర్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాశాడు. తెలంగాణలోనే కాక దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు.

అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు జయశంకర్ సార్. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో ప్రేరేపించారు. ఎమర్జెన్సీ కాలంలో సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో కాలేజీని నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుంచి కాపాడారు. అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ కే సాధ్యం అంటూ ఆయనకు తనకు 35 ఏళ్ల అనుబంధం ఉందని, ప్రముఖ సాహీతివేత్త రామశాస్త్రి కన్నీళ్లపర్యంతమయ్యారు.

విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి.. గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుంచే 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసాడు.

భవిష్యత్తు తెలంగాణలో అభివృద్ధి చాలా శీఘ్రంగా జరుగుతుందని జయశంకర్ సార్ అనేవారు. నీళ్లలో మన వాటా తేలిన తర్వాత జలవనరుల విషయంలో స్వేచ్ఛ ఉంటుంది. స్వయంపాలనలో శాసిస్తాం... ఇతరుల పాలనలో యాచిస్తున్నాం.పెద్ద ప్రాజెక్టుల సంగతి కాసేపు పక్కన పెడితే.. నిజాం కాలంనాటికే తెలంగాణ ప్రాంతంలో గొలుసు చెరువులు చాలా ఉండేవి. ఉద్దేశ పూర్వకంగానే వాటిని నాశనం చేశారు. తెలంగాణ వస్తే మొదటగా ఈ చెరువులను పునరుద్ధరించాలి. అన్నీ సాధ్యం కాకపోవచ్చు.. అయినా వీటిని బాగుచేస్తే.. గ్రామీణ వ్యవస్థ సస్యశ్యామలం అవుతుంది. ఇక నిజాం కాలంలో విద్య, వైద్యం రెండూ ఉచితమే.. అయితే వీటన్నింటిని వారు నాశనం చేశారు. అభివృద్ధి అంటారు కానీ వాళ్లు ఇక్కడ ఒక్క ఆసుపత్రినిగానీ, కాలేజీనిగానీ కట్టారా?ముఖ్యంగా వనరుల కొరత ఉండదు. ఇప్పుడు వాటిని ఇష్టానుసారంగా, అక్రమంగా తరలించుకుపోతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మన పైసలు మనం వాడుకుంటాం. ఆయన చెప్పినట్టు జరుగుతుంది.
ఇక్కడ ప్రజాస్వామిక సంస్కృతిని ధ్వంసం చేశాయి ప్రభుత్వాలు. ఉద్యమాలను అణచివేసే పేరుతో బీభత్సం సృష్టించారు. అడుగడుగున పోలీస్ రాజ్యమే ఉంది. అందుకే ప్రజాస్వామిక సంస్కృతి తిరిగి స్థాపించబడాలి అన్నారు. తెలంగాణలో ఇవన్నీ సాధ్యమే అన్నారు. అలానే జరుగుతుంది. స్వ రాష్ట్రం అభివృద్దిలో పరుగులు తీస్తోంది.

English summary
telangana cm kcr remember prof jayashankar. friday jayashankar sir birth anniversary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X