• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఏపీకి వస్తా.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, అసదుద్దీన్ సెక్యులర్, నెల రోజుల్లో మార్పులు: కేసీఆర్

|
  KCR Press Meet : KCR Satirical Comments On Chandrababu Naidu | Oneindia Telugu

  హైదరాబాద్: దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరముందని, త్వరలో తాను జాతయ రాజకీయాల్లో కీలకంగా మారుతానని తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆయనపై సెటైర్లు వేశారు.

  మనకు ఈ విజయం ఎంత ముఖ్యమో, బాధ్యత కూడా అంతేనని కేసీఆర్ చెప్పారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయమై తాను పలు జాతీయ పార్టీల నేతలతో మాట్లాడానని చెప్పారు. త్వరలో ఢిల్లీకి వెళ్తానని చెప్పారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పారు. అక్కడ మరో పార్టీ లేకపోవడం వల్లే వారు గెలిచారన్నారు. బీజేపీ లేకుంటే కాంగ్రెస్, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అవుతోందన్నారు. మరోదిక్కులేక కాంగ్రెస్ గెలిచిందన్నారు.

  మాలోని కొట్లాటతో 15 సీట్లు ఓడిపోయాం

  మాలోని కొట్లాటతో 15 సీట్లు ఓడిపోయాం

  తమ పార్టీలోని లోపలి తప్పుల వల్లే 15 సీట్లు కోల్పోయామని కేసీఆర్ చెప్పారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలోనే తమ పార్టీలోని కొట్లాటల వల్లే సీటు కోల్పోయామన్నారు. ఆ నేతలకు తాను ఫోన్ చేసి సంఘీభావంకూడా తెలిపానని అన్నారు. మా పార్టీలోని రెండు వర్గాల నేతలే కొట్టుకున్నారని, దీంతో పదిహేను చోట్ల ఓడిపోయామన్నారు.

  జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర

  జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర

  తాను రాష్ట్రాన్ని చక్కగా పాలించుకుంటూనే జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చెప్పారు. రాబోయే నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో మీరు గుణాత్మక మార్పులు చూస్తారని చెప్పారు. ఏం చేయబోతున్నామనేది త్వరలో చూస్తారని చెప్పారు. బీజేపీ ముక్త్ భారత్, కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాల్సి ఉందని చెప్పారు. దేశానికి తెలంగాణ ఓ మార్గం చూపుతుందని అన్నారు. కొన్ని పార్టీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో బీజేపీ సర్జికల్ స్ట్రయిక్స్, మందిర్ అంటూ తెరపైకి తీసుకు వస్తోందని మండిపడ్డారు.

  నాలుగు పార్టీలను ఏకం చేస్తే రాజకీయం కాదు

  నాలుగు పార్టీలను ఏకం చేస్తే రాజకీయం కాదు

  నాలుగు పార్టీలను ఏకం చేయడం రాజకీయం కాదని కేసీఆర్ చెప్పారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ తాము వాడుకోలేకపోతున్నామని చెప్పారు. తాము తెలంగాణ వేదికగా దేశానికి మేలు చేయబోతున్నామని చెప్పారు. పాలమూరు జిల్లాను పచ్చగా చేయబోతున్నామని, అందుకే 14 నియోజకవర్గాల్లో 13 సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుందని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షం చాలా మూర్ఖంగా వ్యవహరించిందని ఆరోపించారు.

  ఢిల్లీ పెత్తనం ఏమిటి

  ఢిల్లీ పెత్తనం ఏమిటి

  ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే ప్రైమరీ స్కూల్ పైన ఢిల్లీకి పెత్తనం అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు. పాకిస్తాన్‌తో గొడవ తెగడం లేదు కానీ ఇవి అవసరమా అన్నారు. విద్య, వ్యవసాయం, హెల్త్ గురించి కేంద్రానికి ఎందుకని ప్రశ్నించారు. ఈ దేశానికి చెందిన బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా తాను అడుగుతున్నానని, నక్సలిజం, టెర్రరిజం ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. పట్టణాభివృద్ధిపై కేంద్రం పెత్తనం ఏమిటని అడిగారు. ఇంత పెద్ద దేశానికి ఒక్క సుప్రీం కోర్టు ఏమిటని అడిగారు. దేశంలో మార్పు రావాల్సి ఉందని చెప్పారు. దేశం ఇంకెప్పుడు మారుతుందని అడిగారు. దేశంలోని కొన్నిప్రాంతీయ పార్టీలతో కలిసి సరికొత్త కూటమి రాబోతుందని చెప్పారు.

  తెలంగాణ వేదికగా దేశానికి మేలు చేయబోతున్నాం

  తెలంగాణ వేదికగా దేశానికి మేలు చేయబోతున్నాం

  50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండవద్దని సుప్రీం కోర్టు తీర్పు చెబితే కేంద్రం ఎందుకు పిటిషన్ వేయలేదని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్ర విభజన కారణంగా ముస్లీంలు, గిరిజనులు తెలంగాణలో పెరిగారని, అందుకే రిజర్వేషన్ అంటున్నామని చెప్పారు. రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సచివాలయానికి రావడం లేదని అంటారని.. కానీ సీఎం ఎక్కడ ఉంటే అక్కడే సచివాలయం అన్నారు. తాను సచివాలయానికి వెళ్లనని, ఫాంహౌస్‌లో ఉన్నానని కామెంట్ చేసిన వారికి ఏమయిందో చూశామన్నారు. ఈ దేశంలో రైతులు ఏం పాపం చేశారని నిలదీశారు. ప్రధాని నిజామాబాద్ పట్టణానికి వచ్చి కరెంట్ సరిగా లేదని అవాస్తవాలు చెప్పారన్నారు. తెలంగాణ వేదికగా దేశానికి మేలు చేయబోతున్నామని చెప్పారు.

  ఏపీకి వస్తా, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా

  ఏపీకి వస్తా, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా

  తెలుగు ప్రజలు బాగుండాలని తాను కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. ఏపీ నుంచి తమకు లక్షల కొలది పోన్లు, సందేశాలు వచ్చాయని చెప్పారు. తమను ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలని అడుగుతున్నారని చెప్పారు. వాట్సాప్‌లో తమకు సందేశాలు వస్తున్నాయన్నారు. చంద్రబాబు తెలంగాణకు వచ్చి ఇక్కడ పని చేశారని, మేం కూడా ఏపీకి వెళ్లి అక్కడ పని చేయవద్దా అన్నారు. చంద్రబాబు ఇక్కడకు వచ్చి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారని, నేను కూడా ఏపీకి వెళ్లి ఇస్తానని చెప్పారు. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లేకుంటే ఏమైనా అంటే తెలంగాణ వారికి సంస్కారం లేదని అంటారని చెప్పారు. నేను ఏపీకి వెళ్తానని, దాని ఫలితం ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు.

  చంద్రబాబుకు పైత్యం, మోడీని పొగడబోయి బొక్కబోర్లా పడ్డారు

  చంద్రబాబుకు పైత్యం, మోడీని పొగడబోయి బొక్కబోర్లా పడ్డారు

  చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉందని కేసీఆర్ అన్నారు. ఆయన ఏం మాట్లాడారు.. అని సస్పెన్స్‌లో ఉంచి రేపు చెబుతానని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు తలబిరుసు అయిందన్నారు. గతంలో చంద్రబాబు ప్రధాని మోడీ అతిగా పొగడబోయి బొక్కబోర్లా పడ్డారని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. రాజకీయంగా దేశంలో అనిశ్చితి ఉందని, అది మారాలని కేసీఆర్ చెప్పారు. అక్బరుద్దీన్ సెక్యులర్ లీడర్ అని కేసీఆర్ కితాబిచ్చారు. అందుకే ఇద్దరం కలిసి పని చేస్తామని తెలిపారు. నెల రోజుల్లో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు చూడబోతున్నారని చెప్పారు.

  English summary
  Telangana Caretaker Chief Minister K Chandrasekhar Rao on Tuesay said that he is ready to give return gift to TDP cheif Chandrababu Naidu in Andhra Pradesh politics.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more