హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ పైనే కేసిఆర్ దృష్టి : మూడు నెల‌ల్లో పూర్త‌వ్వాలి : ఈ హడావుడి అంత‌ర్యం ఏంటి..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఢిల్లీ పై స్పెష‌ల్ గా ఫోక‌స్ చేసారు. రెండో సారి తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌..ఆయ‌న వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయ అడుగులు వేస్తున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న కు వెళ్లిన కేసిఆర్ అక్క‌డ ఎటువంటి హంగామా లేకుండా త‌న కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తున్నారు. అదే స‌మ‌యంలో..కొన్ని హ‌డావుడి నిర్ణ‌యాలు తీసుకుంటు న్నారు..ఇప్పుడు ఇదే చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది. వీటి అంత‌ర్యం ఏంట‌నే ప్ర‌శ్న మొద‌లైంది..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసిఆర్ ఢిల్లీలో త‌న ప్ర‌ణాళిక‌ల‌ను అమలు చేస్తున్నారు. తెలంగాణ లో రెండో సారి అధికారం లోకి వ‌చ్చిన వెంట‌నే..కేసిఆర్ త‌న‌తో పాటు మ‌రొక్క‌రే ప్ర‌మాణ స్వీకారం చేసారు. ఆ త‌రువాత ఇప్ప‌టి వ‌ర‌కూ క్యాబినెట్ విస్త‌రణ ఎప్పుడ‌నేది స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇదే స‌మయంలో త‌న‌యుడు కేటిఆర్ ను పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా నియ మించారు. ఇప్పుడు తెలంగాణ లో ప్ర‌జా ప్ర‌భుత్వం ఉన్నా..మంత్రులు అందుబాటులో లేరు. ఇక‌, ముఖ్య‌మంత్రి కేసిఆర్ జాతీయ రాజ‌కీయాల పై ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు.

KCR serious concentrate on National politics : Taking serious decisions..

బిజెడి నేత న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌త‌, బిఎస్పీ, ఎస్పీల అధినేత‌ల‌తో కేసిఆర్ స‌మావేశ‌మ‌య్యారు. నాన్ కాంగ్రెస్ - నాన్ బిజెపి ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు దిశ‌గా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌ధ‌ని మోదీని క‌లిసారు. ఆ స‌మావేశం పై ఏపి ముఖ్య‌మంత్రి లాంటి వారు విమ‌ర్శ‌లు చేసారు. ఇదే స‌మ‌యంలో..కేసిఆర్ ఢిల్లీ వేదిక‌గా చేయ‌బోయే రాజ‌కీయాల కోసం ముంద‌స్తు గా అక్క‌డ అన్ని ఏర్ప‌ట్లు చేసుకుంటున్నారు.

పార్టీ కార్యాల‌యం ఏర్పాటు పై దృష్టి..

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయాన్ని నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం అను వైన స్థలాన్ని పరిశీలించాలని ఎంపీలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. స్థలాలను కేసీఆర్‌ స్వయంగా పరిశీలిస్తు న్నారు. పార్ల‌మెంట్ లో ప్రాతినిధ్యం ఉన్న రాజ‌కీయ‌ల పార్టీల‌కు పార్టీ ఆఫీసు ఏర్పాటు కోసం కేంద్రం స్థ‌లాన్ని కేటా యిస్తుంది.

అందులో భాగంగా.. టీఆర్‌ఎస్‌కు వెయ్యి గజాల స్థలాన్ని కేంద్రం కేటాయించనుంది. సంక్రాంతి తర్వాత పార్టీ ఆఫీసు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రెండు, మూడు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఉగాది నాటికి పార్టీ కార్యాల‌యం సిద్దం కావాల‌ని కేసిఆర్ చెబుతున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్త‌య్యే నాటికి ఢిల్లీలో కేసీఆర్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేసుకుంటున్న‌ట్లు క‌నిపిస్తోంది. అయితే, కేసిఆర్ వేస్తున్న అడుగులు చూస్తుంటే...ఇక కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌కే ప‌రిమితం అవుతారా..మ‌రి..తెలంగాణ లో ఏం చేయ‌బోతున్నార‌నేది ఇప్పుడు మ‌రింత ఆస‌క్తి క‌రంగా మారింది..

English summary
KCR in high speed in Delhi politics. Now he concentrated on Party office in Delhi. He wants to be active in national politics. It hints more unexpected political developments may take place in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X