హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సామాజిక ఇంజినీర్ అట.. భాష్యం చెప్పిన మంత్రి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పునర్ నిర్మాణంలో ఇంజినీర్లది కీ రోల్ అన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తుచేశారు. నీటిని ఒడిసిపట్టడం ఇంజినీర్ల బాధ్యతేనని .. వారి కృషితో ప్రాజెక్టుల నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో భవిష్యత్ తరాల సాగునీటి కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇక వెలుగులే ..
నిజాం సాగర్ నిర్మించి నవాబ్ అలీ జంగ్ రైతులను ఎనలేని మేలు చేశారని గుర్తుచేశారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. రైతుల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఇంజినీర్ కాదని .. కానీ సోషల్ ఇంజినీర్‌గా అభివర్ణించారు మంత్రి. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంతో ఆయన దార్శనికతను అద్దం పడుతుందని వివరించారు. భగీరథ ప్రయత్నంగా కేవలం మూడున్నరేళ్లలో ప్రాజెక్టులు పూర్తవడం చిన్న విషయమేమి కాదని పేర్కొన్నారు.

kcr social engineer says minister prashanth reddy

నవాజ్ అలీ జంగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చేందుకు కృషిచేస్తానని మంత్రి వేముల హామీనిచ్చారు. ఓ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సాగుకు నీరు తప్పనిసరి అని గుర్తుచేశారు. ఇంజినీర్ల కృషితోనే నీరును ఒడిసిపట్టగలుగుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రహదారలుు భవనాల శాఖ ఇంజినీర్ల పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సర్వీస్ అంశాలను సీఎంతో చర్చించి న్యాయం చేస్తానని చెప్పారు.

English summary
The key role of engineers in the reconstruction of Telangana state is said by Minister Vemula Prashant Reddy. Telangana state was created for the sake of water, funds and appointments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X