హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌..! ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ లోకి జ‌గ‌న్ కు ఆహ్వానం..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : దేశంలో గుణాత్మ‌క మార్పుకోసం మూడో ప్ర‌త్యామ్నాయం ఆవ‌శ్య‌క‌త ఉంద‌ని, అందకోసం త‌న‌తో క‌లిసి రావాల‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి పిలుపుకు జాతీయ నేత‌లు స్పందించిన విష‌యం తెలిసిందే..! తాజాగా ప్రాంతీయ పార్టీల మ‌ద్ద‌త్తు కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న చంద్ర‌శేఖ‌ర్ రావు ముందుగా ఏపీ లో ప్రతిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సంప్ర‌దించ‌బోతున్నారు. అందుకోసం వ‌చ్చేనెల‌లో ఏపిలో ప‌ర్య‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఐతే ఏపి ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును ప‌లు సంద‌ర్బాల్లో విమ‌ర్శించే చంద్ర‌శేఖ‌ర్ రావు ఏపీ ప‌ర్య‌ట‌న ఎలా సాగుతుంద‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తికర చ‌ర్చ సాగుతోంది.

గుణాత్మ‌క మార్పు రావాలి..! ప్రాంతీయ పార్టీలు కీల‌క పాత్ర పోషించాలంటున్న కేసీఆర్..!!

గుణాత్మ‌క మార్పు రావాలి..! ప్రాంతీయ పార్టీలు కీల‌క పాత్ర పోషించాలంటున్న కేసీఆర్..!!

గులాబీ అధినేత చంద్ర‌శేఖ‌ర్ రావు, దేశ రాజకీయ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తర భారత దేశ ముఖ్యమంత్రులతో సమావేశమై ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ముమ్మరంగా ముందుకు సాగుతున్న కేసీఆర్ త్��రలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పయనం కానున్నట్టు తెలుస్తోంది. దేశంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుతాన్ని తీసుకురావాలనే దృఢ సంకల్పంతో ఉన్న కేసీఆర్ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు స‌మాచారం.

జ‌గ‌న్ తో కేటీఆర్ భేటీ..! త్వ‌ర‌లో కేసీఆర్ ఏపి ప‌ర్య‌ట‌న‌..!!

జ‌గ‌న్ తో కేటీఆర్ భేటీ..! త్వ‌ర‌లో కేసీఆర్ ఏపి ప‌ర్య‌ట‌న‌..!!

తాజాగా ఆంధ్రపదేశ్ ప్రతిపక్ష నేత జగన్ తో కేటీఆర్ భేటీ కావటం, ఎన్నో విషయా���ు చర్చకు రావటం ద్వారా ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. లోటస్ పాండ్ లో జరిగిన ఈ సమావేశంలో జగన్ కేసీఆర్ తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఉన్న అనుమానాలకు తెరదించుతూ జగన్- కేటీఆర్ భేటీ జరిగిందని అంటున్నాయి రాజకీయ వర్గాలు.

జ‌గ‌న్ తో కేసీఆర్ భేటీ..! స‌ర్వ‌త్రా నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

జ‌గ‌న్ తో కేసీఆర్ భేటీ..! స‌ర్వ‌త్రా నెల‌కొన్న ఉత్కంఠ‌..!!

ఇక కేసీఆర్ కూడా అమరావతి ప్రయాణానికి సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. ఈనెల చివరివారం లేదా వచ్చే నెల మొదటివారంలో అమరావతికి కేసీఆర్‌ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పర్యటనలో భాగంగా వైసీపీ పార్టీని ఫెడరల్‌ ఫ్రెంట్‌లోకి ఆహ్వానించనున్నారట కేసీఆర్. లోటస్‌పాండ్‌లో జగన్, కేటీఆర్ భేటీలో ప్రత్యేక హోదా కోసం కేసీఆర్‌ కేంద్రానికి లేఖరాస్తే బాగుంటుందని జగన్ కోరిన‌ట్టు కూడా తెలుస్తోంది.

ప్ర‌త్యేక‌హోదా కోసం కేంద్రానికి లేఖ రాయండి..! కేసీఆర్ కు జ‌గ‌న్ సూచ‌న‌..!!

ప్ర‌త్యేక‌హోదా కోసం కేంద్రానికి లేఖ రాయండి..! కేసీఆర్ కు జ‌గ‌న్ సూచ‌న‌..!!

అయితే ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతు పలుకుతూనే తెలంగాణ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడుదామని కేటీఆర్‌ చెప్పారు. అమరావతిలో భేటీ తర్వాత కేసీఆర్‌ లేఖపై నిర్ణయాన్ని ప్రకటిస్తారని ఆయన అన్నారు. ఇక జగన్ తో మరిన్ని చర్చలు జరిపేందుకు స్వయంగా అమరావతికి వచ్చి కలుస్తానని జగన్‌కు కేసీఆర్‌ చెప్పారని సమాచ��రం. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం ఇది సంచలనంగా మారింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ జగన్ తో కేసీఆర్ సమావేశం కానుండటం ఆసక్తికరంగా మారింది.

English summary
There is a need for a third alternative for qualitative change in the country, National leaders responded to Telangana Chief Minister's call to come with him for that. Chandrashekhar Rao, who is trying to support the latest regional parties, will first contact the opposition leader Jagan Mohan Reddy in the AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X