• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పోలీసులకు ఏందీ దుస్థితి.. హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)

|
  హైదరాబాద్ టు ఖమ్మం.. లీడర్ తిట్ల దండకం..! (వీడియో)

  హైదరాబాద్ : ప్రజా రక్షణలో పోలీసులదే కీలక పాత్ర. సమాజంలో జరిగే చెడును నియంత్రించి నేరాల నిర్మూలనకు అడ్డుకట్ట వేసే బాధ్యత కూడా వారిదే. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ డ్యూటీ సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ క్రమంలో ఫ్రెండ్లీ పోలీసంటూ తీసుకొచ్చిన సంస్కరణలు వారి పాలిట శాపంగా మారుతున్నాయా అన్నట్లు తయారైంది సిట్యువేషన్. కొన్నిచోట్ల పోలీసులపైనే దాడులు జరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. ఆ క్రమంలో ఖమ్మంలో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది. గస్తీ తిరిగే బ్లూకోల్ట్ పోలీసులపై ఓ లీడర్ చేసిన జులుం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  పోలీసులపై లీడర్ జులుం..!

  పోలీసులపై లీడర్ జులుం..!

  పోలీసుల్లో సాఫ్ట్ కార్నర్, హార్డ్ కార్నర్ అంటూ రెండు రకాలుగా ఉంటారేమో. కొన్నిచోట్ల పోలీసుల అరాచకాలు వెలుగుచూస్తుంటే.. మరికొన్ని చోట్ల అమాయక పోలీసులపై నేతల జులుం బయటపడుతోంది. ఆ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులను ఇబ్బందులు పెట్టకుండా ఫ్రెండ్లీ పోలీసంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు రివర్స్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. ఇటీవల పోలీసులపై జరుగుతున్న జులుం చూస్తుంటే పోలీసులకు ఏందీ దుస్థితి అనుకోవాల్సి వస్తోంది.

  ఖమ్మంలో తాజాగా ఓ లీడర్ రెచ్చిపోయారు. పెట్రోలింగ్ చేస్తున్న బ్లూకోల్ట్ పోలీసులపైకి తిరగబడ్డారు. వారు చెప్పేదీ వినిపించుకోకుండా గట్టిగా అరుస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు నేతపై కేసు ఫైల్ చేశారు పోలీసాధికారులు.

  కూరగాయల్లో విషపూరిత పదార్థాలు.. భయానక నిజాలు వెల్లడించిన రీసెర్చ్..!

   ఆ అరుపులేంటి.. కేకలేంటి.. పోలీసులంటే భయం లేదా?

  ఆ అరుపులేంటి.. కేకలేంటి.. పోలీసులంటే భయం లేదా?

  గురువారం నాడు ఖమ్మంలో బ్లూకోల్ట్ పోలీసులు గస్తీ తిరుగుతున్నారు. ఆ క్రమంలో వాహనంపై వెళుతున్న ఓ యువకుడిని ఆపి ప్రశ్నించారు. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించమని కోరడంతో ఇంట్లో ఉన్నాయంటూ సమాధానమిచ్చాడట. దాంతో అతడి ఇల్లు పక్కనే ఉండటంతో అతడిని అనుసరించారు పోలీసులు. తీరా అతడి ఇంటికెళ్లాక లోపలి నుంచి ఓ లీడర్ బయటకొచ్చాడు. వస్తూ వస్తూనే పోలీసులపై విరుచుకుపడ్డాడు. ఇంటివరకు ఎందుకొచ్చారంటూ నిలదీశారు. వారి మీదకు గట్టిగా అరుస్తూ కొట్టేంత పనిచేశారు. సదరు వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

  బిడ్డా.. మీ డీఎస్పీకి ఫోన్ చేస్తా అంటూ బెదిరింపులు..!

  బిడ్డా.. మీ డీఎస్పీకి ఫోన్ చేస్తా అంటూ బెదిరింపులు..!

  సదరు లీడర్ రెచ్చిపోతున్న తీరు చూసి ఓ కానిస్టేబుల్ వీడియో తీయడం స్టార్ట్ చేశారు. దాంతో ఆయనగారికి ఇంకా కోపమొచ్చింది. అసలు మీరెవరు.. ఇక్కడకు ఎందుకొచ్చారంటూ మీదమీదకు వెళ్లారు. వీడియో ఎందుకు తీస్తున్నారంటూ ప్రశ్నిస్తూ ఐడీ కార్డులు చూపించాలని డిమాండ్ చేశారు. వారు ఎంత చెప్పినా వినకుండా నోటికి పనిచెప్పారు. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటమే గాకుండా.. బిడ్డా మీ డీఎస్పీకి చెబుతానంటూ బెదిరించే ప్రయత్నం చేశారు.

  విధినిర్వహణలో భాగంగా తాము వచ్చామే తప్ప.. మీ దగ్గరకు రావాల్సిన అవసరం మాకేంటని సదరు కానిస్టేబుళ్లు మామూలుగానే ఓపిగ్గా సమాధానం చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ బండ్లు ఆపి కాగితాలు అడుగుతారా అంటూ నోటికి ఎంతొస్తే అంత అనేశారు. పైగా డబ్బులు అడుగుతున్నారట.. ఏం సంగతి అని బెదిరించే తీరులో గొంతు పెంచి మాట్లాడారు. రాయలేని భాషలో అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయారు.

  రివర్స్ గేర్ : యువతి వేధిస్తోందని యువకుడు సూసైడ్ అటెంప్ట్..!

  డ్యూటీలో ఉన్నామని చెప్పినా కూడా..!

  డ్యూటీలో ఉన్నామని చెప్పినా కూడా..!

  డ్యూటీలో భాగంగా వాహనం కాగితాలు చూపించామని అడిగామే తప్ప డబ్బులు అడగలేదని ఓవైపు చెబుతున్నా ఏమాత్రం వినిపించుకోలేదు సదరు లీడర్. ఓ కానిస్టేబులో వీడియో తీస్తుండగా ఆయన పైకి అరుస్తూనే పక్కనే ఉన్న మరో పోలీస్ వైపు వేలెత్తి చూపుతూ దురుసుగా ప్రవర్తించారు. దాంతో ఆ పోలీస్ ఎందుకు వేలెత్తి చూపుతున్నారంటూ ప్రశ్నిస్తే ఏయ్ ఏయ్ అంటూ అతడి మీదకు వెళ్లి బెదిరించే ప్రయత్నం చేశారు. అరేయ్ తురేయ్ అంటూ ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడటమే గాకుండా కానిస్టేబుల్ చేతిలోని ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు.

  చివరకు విషయం కాస్తా ఉన్నతాధికారుల ద‌ృష్టికి తీసుకెళ్లడంతో సదరు లీడర్‌పై 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇదివరకు హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఘటనలు చాలా వెలుగు చూశాయి. దాంతో హైదరాబాద్‌లో కనిపించే ఇలాంటి సీన్లు ఖమ్మానికి కూడా పాకాయా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హతవిధీ.. పోలీసులు ఎలా దూషణకు గురవుతున్నారో చూడండంటూ వాట్సాప్ వేదికగా తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A leader in Khammam is provoked. He shouted on Blue colt patrolling police loudly, not listening to what they had to say. A video of the incident has gone viral on social media.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more