హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ ట్వీట్ ఎఫెక్ట్: ఆ అమ్మాయి తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్‌ సస్పెండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కూతురు చనిపోయిన బాధలో ఉన్న ఓ తండ్రిని బూటు కాలితో తన్నిన కానిస్టేబుల్‌పై వేటు పడింది. సదరు కానిస్టేబుల్ శ్రీధర్‌ను సస్పెండ్ చేయాలని హోంమంత్రి మహమూద్ అలీ.. సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ చందనా దీప్తికి గురువారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో సదరు కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించిన నేపథ్యంలో చర్యలు తీసుకోవడం గమనార్హం.

Recommended Video

Sandhya Rani Incident : Public Responce On Telangana Police Behaviour On Sandhya Rani's Father

కాలేజీలో కూతురు ఆత్మహత్య?: శోకంలో ఉన్న తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్, స్పందించిన కేటీఆర్కాలేజీలో కూతురు ఆత్మహత్య?: శోకంలో ఉన్న తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్, స్పందించిన కేటీఆర్

సంధ్యారాణి అనుమానాస్పద మృతి..

సంధ్యారాణి అనుమానాస్పద మృతి..

సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని నారాయణ కాలేలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థిని సంధ్యారాణి మంగళవారం మధ్యాహ్నం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ భవనంలోని బాత్రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం పోలీసులకు తెలిపింది. ఈ విషయం తెలియడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఆస్పత్రి వద్ద ఆందోళన..

తమ కూతురుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. తమ కూతురును కాలేజీ యాజమాన్యమే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సంధ్యారాణి తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థి సంఘాలు, బంధువులు ఆందోళనకు దిగారు. పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రి మార్చూరీలో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అమ్మాయి తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్..

అమ్మాయి తండ్రిని కాలితో తన్నిన కానిస్టేబుల్..

ఆందోళనచేస్తున్నవారిని చెదరగొట్టిన పోలీసులు ఫ్రీజర్‌లో ఉన్న సంధ్యారాణి మృతదేహాన్ని తిరిగి మార్చూరీకి తరలించే ప్రయత్నం చేశారు. దీంతో ఫ్రీజర్ ముందు పడుకుని సంధ్యారాణి తండ్రి నిరసన తెలిపాడు. అక్కడేవున్న కానిస్టేబుల్ శ్రీధర్.. అతడ్ని బూటు కాలితో తన్నాడు. ఆ తర్వాత అతడ్ని ఈడ్చిపడేసి.. సంధ్యారాణి మృతదేహాన్ని ఆస్పత్రి మార్చూరీలోకి తీసుకెళ్లారు. అయితే, ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో పోలీసు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

మంత్రి కేటీఆర్ ట్వీట్‌తో..


ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధలో ఉన్న ఓ వ్యక్తితో ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నారు. పోలీసులు ఇలా దురుసుగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. సదరు పోలీసు కానిస్టేబుల్ కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించారని మండిపడ్డారు. అంతేగాక, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీలను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆ కానిస్టేబుల్‌ను సంగారెడ్డి ఇంఛార్జీ ఎస్పీ సస్పెండ్ చేశారు.

మొదట అటాచ్ చేసి.. తాజాగా సస్పెన్షన్..

ప్రాథమిక నివేదిక ఆధారంగా దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ శ్రీధర్‌ను సంగారెడ్డి ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని, ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తాజాగా, ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సంగారెడ్డి ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
the cop suspended due to kicking a distressed father who had just lost his teenage daughter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X