హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త వ్యవసాయ చట్టాలు: రైతులకు మేలంటూ కిషన్ రెడ్డి, జయప్రకాశ్ నారాయణ ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కేంద్రం తీసుకొచ్చిన నూతన చట్టాలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమాజిగూడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి తోపాటు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

కనీస మద్దతు ధర రద్దు చేయం: కిషన్ రెడ్డి

కనీస మద్దతు ధర రద్దు చేయం: కిషన్ రెడ్డి


ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర రద్దు చేయబోమని స్పష్టం చేశారు. రైతు తనకు నచ్చిన వారికి, నచ్చిన ధరకు పంటను అమ్ముకునే స్వేచ్ఛను నూతన చట్టాల్లో పొందుపర్చామని తెలిపారు. దేశంలో విత్తన వ్యవస్థ బహుళజాతి సంస్థల్లో బందీ కావడానికి కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు.

రైతులకు అన్యాయం చేసేలా వద్దు..

రైతులకు అన్యాయం చేసేలా వద్దు..


కరోనా రాకపోయుంటే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేదని కిషన్ రెడ్డి చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలపై ఏ రైతు సంఘంతోనైనా చర్చించేందుకు కేంద్రం సిద్ధమని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం చేసేవిధంగా రాజకీయ నేతలు మాట్లాడొద్దని కిషన్ రెడ్డి హితవు పలికారు. తమ స్వార్థం కోసమే కొందరు రాజకీయ నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

రైతులను తప్పుదోవ పట్టించొద్దు..

రైతులను తప్పుదోవ పట్టించొద్దు..

ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరగాలంటే దళారుల వ్యవస్థ పోవాలని నిపుణులు సూచించారని, వారి సిఫార్సులకు అనుగుణంగానే కొత్త చట్టాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు నష్టపోతారంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అన్నదాతలకు మేలు జరిగేలా రైతు సంఘాలు వ్యవహరించాలని, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని సూచించారు.

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలేనంటూ జేపీ

కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలేనంటూ జేపీ

అనంతరం జయప్రకాశ్ నారాయణ మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం పాలకులేనని అన్నారు. మార్కెట్ యార్డుల్లో గుత్తాధిపత్యం నడుస్తోందన్నారు. డిమాండ్ ఉన్న చోట పంటను అమ్ముకునే సౌలభ్యం రైతుకు ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు మేలు చేస్తాయన్నారు. ఈ చట్టాలపై కొందరు రైతులను తప్పుదోవపట్టిస్తురన్నారు.

English summary
kishan reddy and jayaprakash narayana on new farm act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X