హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వెనుకబడ్డది.. టీఆర్ఎస్‌పై కిషన్ రెడ్డి ఫైర్.. నిజామాబాద్‌కు పసుపు బోర్డు హామీ..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న చందంగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. ఈ రెండు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధించుకుంటూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. ఇటీవల బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా రాష్ట్రానికి వచ్చిన దరిమిలా గులాబీ, కమలం పువ్వు నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. ఆ క్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

కేంద్ర సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు కిషన్ రెడ్డి. కావాలనే వాటిని అడ్డుకుంటూ బీజేపీపై ఎదురుదాడికి దిగుతోందని ఫైరయ్యారు. అది మంచి పద్దతి కాదని.. రాజకీయం ముసుగులో ప్రజలకు అన్యాయం చేయొద్దని సూచించారు. వేల్ఫేర్ స్కీముల్లో రాజకీయం చేయడమేంటో వాళ్లకే తెలుసంటూ ఎద్దేవా చేశారు.

kishan reddy fires on trs government for not implement of central welfare schemes

క్లాస్‌రూమ్‌లో హెల్మెట్ ధరించి.. ఉపాధ్యాయుడి వింత నిరసన..!

అభివృద్ధి విషయంలో తెలంగాణ వెనుకబడిందని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఉద్యమ నేపథ్యంతో ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణలో అభివృద్ది జరగాలంటే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలోకి రావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని వెల్లడించారు.

తాను మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న హోం శాఖ ద్వారా తెలంగాణకు కావాల్సినంత చేయూత అందిస్తానని భరోసా ఇచ్చారు. కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని లేబర్ చట్టాలను సవరిస్తున్నామని తెలిపారు. అదే క్రమంలో ఉద్యోగుల భవిష్య నిధి (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్) విషయంలో ఉద్యోగులకు ఎలాంటి లాభం చేకూర్చాలనే విషయంలో కేంద్రం బాగా ఆలోచిస్తోందని చెప్పుకొచ్చారు. అదలావుంటే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ నూటికి నూరుపాళ్లు కట్టుబడి ఉందని.. అందులో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు.

English summary
Kishan Reddy Fires On TRS government's failure to implement central welfare schemes in Telangana. He promised that haldi board will be grants for nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X