హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ విధాత జయశంకర్ సార్ : కోదండరాం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : జయశంకర్ సార్ అంటే ఓ శక్తి అన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ ఉద్యమాన్ని వెనుకుండి నడిపించిన ధీరుడని కొనియాడారు. ఆయన సారథ్యంలోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని పేర్కొన్నారు. జయశంకర్ జయంతి సందర్భంగా టీజేఎస్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యమ సమయంలో పనిచేసిన విధానాన్ని గుర్తుచేసుకున్నారు.

జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కోదండరాం. జయశంకర్ సార్ మేధావి అని కొనియాడారు. ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో పదవులు తిరస్కరించిన గొప్ప నేత అని కీర్తించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఏపీలో కూడా సమావేశాలు పెట్టి తమ గోడును వివరించారని పేర్కొన్నారు. వారికి కూడా రాష్ట్ర విభజనతో కలిగే మేలును వివరించి .. ఒప్పించారని తెలిపారు.

kodandaram praise jayashankar sir

జయశంకర్ నిబద్దత, పట్టుదల, మంచితనాన్ని నేటి తరం నేర్చుకోవాలని సూచించారు. తెలంగాణ గురించి జయశంకర్ సార్ వద్ద తాను చాలా విషయాలు నేర్చుకున్నానని గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో పదవులు తిరస్కరించిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని పేర్కొన్నారు. తన పదవీ విరమణ తర్వాత ఇబ్బంది పడ్డ మాట వాస్తవమేనని చెప్పారు. రాజకీయ నేత కాకపోయినా ఆయనకు కూడా చాలా మంది అభిమానులు ఉన్నారని తెలిపారు.

English summary
Telangana Janata Samiti president Kodandaram said Jayashankar sir was a force. The leader of the Telangana movement is known as a hero. He said that the state of Telangana was achieved under his leadership. Kodandaram participated in the celebrations held at TJS office during Jayashankar Jayanti.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X