హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీలో చేరిక అంశంపై స్పందించిన ఎంపీ కోమటి రెడ్డి .. ఏమన్నారంటే

|
Google Oneindia TeluguNews

ఒకపక్కన రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలను ఫిరాయింపులకు ప్రోత్సహించి పార్టీకి తీరని నష్టం చేస్తుంటే, మరోపక్క కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిజెపి సైతం తెలంగాణ కాంగ్రెస్ ను టార్గెట్ చేసిందని అందులో భాగంగా ఇటీవల గెలిచిన ఎంపీల్లో ఇద్దరు ఎంపీలు బిజెపికి జంప్ అవుతారని ప్రచారం జోరుగా సాగింది. ఇక ఈ ప్రచారం పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

కూతురిపై మారుతీరావుకి ఎంత పగో .. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రణయ్ హత్య చార్జ్ షీట్ ! <br>కూతురిపై మారుతీరావుకి ఎంత పగో .. సంచలన విషయాలు బయటపెట్టిన ప్రణయ్ హత్య చార్జ్ షీట్ !

తెలంగాణా రాష్ట్రంలో రానున్న ఐదేళ్ళలో బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మార్చే పనిలో బీజేపీ ఉందని తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి 12మంది ఎమ్మెల్యేల ఫిరాయిమ్పుతో కుదేలైన కాంగ్రెస్ కోలుకునే స్థితిలో లేదని అందుకే తాజాగా ఎంపీలుగా గెలిచిన వారు సైతం పార్టీ మారుతున్నారని బీజేపీలోకి జంప్ అవుతున్నారని ప్రచారం జోరుగానే సాగింది. ఇక అంతే కాదు . బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసినట్లుగానూ ప్రచారం సాగింది . ఇక వీరితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కెసిఆర్ అన్న కూతురు రమ్యా రావు, మాజీ ఎంపీ వివేక్ కూడా కలిశారని కూడా చెప్పుకున్నారు .

Komati reddy reacted about the joining in BJP .. do you know what he said ?

Recommended Video

టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న వివిధ పార్టీల నాయకులు

ఇక ఈ వార్తలను చాలా గట్టిగా ఖండించారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి . కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాము బీజేపీలో చేరుతున్నామని వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ను వీడి వెళ్ళేది లేదని చెప్పారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తన లక్ష్యమన్నారు. నిన్న మొత్తం నియోజకవర్గంలోనే పర్యటించినట్లు కోమటిరెడ్డి పేర్కొన్నారు. తాను నల్గొండలో ఉంటే ఢిల్లీ ఎప్పుడు, ఎలా వెళ్లి రాం మాధవ్ ను కలిశానో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తప్పుడు వార్తా కథనాలు ప్రసారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కావాలనే తనపై దుష‍్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాను బీజేపీలో చేరనని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి కూడా స్పందించాల్సి వుంది.

English summary
There is a propaganda campaign that two MPs from the Telangana Congress are ready to join the BJP. Congress Working President Revanth Reddy and Komatireddy Venkat Reddy met BJP general secretary Ram Madhav .Komati reddy strongly condemned the news about his joining in the BJP. He said that all the news that he was going to join the BJP is not true. He said that he did not leave Congress. His goal is to strengthen the Congress party and bring the party to power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X