హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జీహెచ్ఎంసీ ఫలితాల వేళ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ట్వీట్: బీజేపీలో చేరిక ఖాయమే!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ కన్నా బీజేపీకి అత్యధిక సీట్లు రావడంపై ఆయన స్పందన బీజేపీకి అనుకూలంగా ఉండటం గమనార్హం.

టీఆర్ఎస్ ఎదుర్కునేది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు


పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉద్యోగులు, పెద్దల అభిప్రాయాన్ని ప్రతిబింభించాయన్నారు. ఈ ఓట్లను పరిశీలిస్తే రెండు విషయాలు స్పష్టమవుతున్నాయని తెలిపారు. సాధారణ ప్రజలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. వారంతా జీహెచ్ఎంసీలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్‌ను ఎదుర్కొంటుందని భావించారన్నారు. కాంగ్రెస్.. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేదని ప్రజలు స్పష్టతనిచ్చారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన ట్వీట్‌లో వెల్లడించారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిక ఖాయమేనా?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిక ఖాయమేనా?

కాగా, ఓ వైపు కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కేవలం ఐదు స్థానాలకే పరిమితమయ్యే దిశగా సాగుతున్న వేళ.. ఆ పార్టీ సీనియర్ నేత అయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన త్వరలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరతారనే వాదనలకు బలం చేకూరినట్లయిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాగా, ఇప్పటికే బీజేపీ కీలక నేతలు.. విశ్వేశ్వర్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్

మేయర్ పీఠం కైవసం చేసుకునే దిశగా టీఆర్ఎస్

ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో మొదట జోరు చూపించిన బీజేపీ.. ఇప్పుడు రెండో స్థానానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అటు అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు బీజేపీ గట్టి పోటీనిచ్చింది. పాతబస్తీలోనూ పలు స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శించింది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలను గమనిస్తే బీజేపీ రెండో స్థానంలో, ఎంఐఎం మూడో స్థానంలో కొనసాగుతోంది. టీడీపీ అడ్రస్ గల్లంతైనట్లే కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం మరోసారి దక్కిుంచుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటి వరకు వెలుడిన ఫలితాల ప్రకారం.. 55 స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా, 4 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 7స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో గెలిచింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఒక స్థానంలో గెలుపొందింది.

English summary
konda vishweshwar reddy latest tweet on ghmc poll results: it says may join in bjp soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X