హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూకట్‌పల్లి వాసులకు భారీ ఫైన్... ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

|
Google Oneindia TeluguNews

కూకట్‌పల్లి: వృక్షో రక్షతి రక్షితః అన్నారు. చెట్లను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనమంత ఆరోగ్యంగా ఉంటాం. ఓ వైపు హరితహారం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మొక్కలు నాటుతుంటే మరోవైపు కొందరు చెట్లను అడ్డుగా ఉన్నాయని నరికేస్తున్నారు. తాజాగా మేడ్చల్ అటవీశాఖ కూకట్‌పల్లి హౌజింగ్‌బోర్డులోని ఓ గేటెడ్ కమ్యూనిటీకి భారీ జరిమానా విధించింది.

 చెట్లు నరికిన ఇందు ఫార్చూన్‌ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీ

చెట్లు నరికిన ఇందు ఫార్చూన్‌ గార్డెనియా గేటెడ్ కమ్యూనిటీ

కూకట్‌పల్లిలోని ది ఇందూ ఫార్చూన్ గార్డెనియా అనే గేటెడ్ కమ్యూనిటీకి మేడ్చల్ అటవీశాఖ రూ.53,900 జరిమానా విధించింది. గేటెడ్ కమ్యూనిటీ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ 25 నుంచి 30 అడుగుల పొడవున్న 55 చెట్లను నరికేసింది. అంతేకాదు ఆ చెట్లను కేపీహెచ్‌బీ పార్కుకు తరలిస్తామని చెప్పి మాట తప్పడంతో అటవీశాఖ ఈ జరిమానా విధించింది. 22 ఫిబ్రవరిన గ్రీన్‌బెల్ట్ జోన్‌కు చెందిన ఈ చెట్లు ఫేజ్13లోని ఇందు గార్డెనియా అపార్ట్‌మెంట్స్ దగ్గర నరికివేయడం జరిగింది.

జరిమానా విధిచిన మేడ్చల్ అటవీశాఖ

జరిమానా విధిచిన మేడ్చల్ అటవీశాఖ

చెట్లను నరుకుతున్నారన్న సమాచారం అటవీశాఖ దృష్టికి రావడంతో సొసైటీ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్‌పై రూ.53,900 జరిమానా విధించారు. చెట్లను నరికివేసేందుకు అటవీశాఖ నుంచి సొసైటీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని మేడ్చల్ జిల్లా అటవీశాఖాధికారి సుధారకర్ రెడ్డి చెప్పారు. ఇక నరికివేయబడ్డ చెట్లన్నీ అంతరించి పోతున్న వృక్షాల జాబితాలో ఉండటంతో వాటిని కూల్చాలంటే అనుమతి తప్పనిసరని సుధాకర్ రెడ్డి చెప్పారు. ఇది అక్రమమైన పని కావడంతో సొసైటీపై భారీ జరిమానా విధించినట్లు చెప్పారు.

Recommended Video

TRS MLA's CAA Controversy : Pak People Are Welcome In Telangana | Oneindia Telugu
వాల్టా చట్టం కింద జరిమానా

వాల్టా చట్టం కింద జరిమానా


వాల్టా (వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ 2002) చట్టం కింద జరిమానా సొసైటీకి జరిమానా విధించినట్లు అటవీశాఖాధికారి సుధాకర్ రెడ్డి చెప్పారు. ఈ తరహా చెట్లను అనుమతి లేకుండా కూల్చితే ఆ చెట్టు ఎంత విలువైతే చేస్తుందో అంతకు రెట్టింపు జరిమానా విధించాల్సిందిగా చట్టంలో ఉందని సుధాకర్ రెడ్డి చెప్పారు. ఆ జరిమానా ఐదు రెట్ల వరకు కూడా పొడిగించే అవకాశాలున్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే కేపీహెచ్‌బీ పార్కుకు ఈ చెట్లను తరలించామని సొసైటీ ప్రెసిడెంట్ చెప్పగా అటవీశాఖాధికారులకు అనుమానం వచ్చింది. ఇక నరికిన చెట్ల స్థానంలో ఒక చెట్టుకు బదులు రెండు చెట్లను నాటాల్సి ఉంటుంది. అంతేకాదు మరోచోటికి చెట్లను తరలించినప్పుడు వాటి మెయింటెనెన్స్ కూడా చూడాల్సి వస్తుంది. పైగా ఇప్పుడు వాతావరణం కూడా ఆ చెట్లకు అనుకూలించదని సుధాకర్ రెడ్డి చెప్పారు.

English summary
The Medchal forest department has come down heavily on a gated community in KPHB for illegally cutting down trees. The department, on 28 February, imposed a fine of Rs. 53,900 on the Indu Fortune Fields Gardenia gated community located in KPHB.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X