హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అందుకే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, కేసీఆర్‌ను ఉద్దేశించి అసదుద్దీన్ ఏమన్నారంటే?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన తనయుడు, సిరిసిల్ల నుంచి గెలిచిన కల్వకుంట్ల తారక రామారావుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచిన మూడు రోజులకే, తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.

తెరాస నూతన అధ్యయనం

ఇప్పటి వరకు తెరాసలో కార్యనిర్వాహక అధ్యక్ష (వర్కింగ్ ప్రెసిడెంట్) పదవిలో ఎవరూ లేరు. ఈ నియామకంతో తెరాసలో నూతన అధ్యయానికి కేసీఆర్ తెరదీశారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశ్యంతోనే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించారని తెలుస్తోంది.

టీఆర్ఎస్ లో KTR నెంబర్ 2.. అధికారికంగా ప్రకటించిన KCRటీఆర్ఎస్ లో KTR నెంబర్ 2.. అధికారికంగా ప్రకటించిన KCR

అసంతృప్తులకు కేటీఆర్ బుజ్జగింపు

అసంతృప్తులకు కేటీఆర్ బుజ్జగింపు

అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస గెలుపు కోసం కేసీఆర్, హరీష్ రావు వంటి నేతలతో పాటు కేటీఆర్ కూడా కీలకంగా పని చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా ఎన్నికలకు ముందు తెరాస అసంతృప్తులను బుజ్జగించటంలో కేటీఆర్ ఫలప్రదం అయ్యారు. కొడంగల్ వంటి కీలక చోట్ల ప్రచారం నిర్వహించారు. మరోవైపు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ పైన ఆయన దృష్టి సారించడం తగ్గిపోతుంది. ఇందుకోసం కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చేశారు.

కీలకంగా వ్యవహరించే ఛాన్స్

కీలకంగా వ్యవహరించే ఛాన్స్

కేటీఆర్ గతంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా విజయవంతమయ్యారు. 150 స్థానాలకు గాను తెరాస 99 స్థానాల్లో గెలిచింది. గత ప్రభుత్వంలో కీలకమైన ఐటీ వంటి పలు శాఖలను సమర్థంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సిరిసిల్లా నుంచి భారీ మెజార్టీతో గెలిచారు. కేటీఆర్‌కు కీలక పదవి అప్పగించడంతో రాష్ట్ర రాజకీయాలు, పాలనా వ్యవహారాలకు సంబంధించి ఆయన అత్యంత క్రియాశీలంగా వ్యవహరించే అవకాశముంది.

అసదుద్దీన్ శుభాకాంక్షలు

అసదుద్దీన్ శుభాకాంక్షలు

కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడంపై అసదుద్దీన్ ఓవైసీ శుభాకాంక్షలు తెలిపారు. అత్యంత నమ్మకస్తుడు, సమర్థుడైన వ్యక్తికే తాను పార్టీ పగ్గాలు అప్పగించానని కేసీఆర్ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నియామకంపై అసదుద్దీన్ స్పందిస్తూ... కొత్త బాధ్యతలు అందుకున్న కేటీఆర్‌కు శుభాకాంక్షలు అంటూ... కేసీఆర్ తన కుమారుడికి చాలా బరువైన బాధ్యతను అప్పగించారని, ఈ బాధ్యతలను కేటీఆర్ సక్రమంగా నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

English summary
KT Rama Rao, the legislator from Sircilla, has been appointed Executive Working President of the Telangana Rashtra Samithi Party (TRS) by the President and Chief Minister Kalvakuntla Chandrashekhar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X