హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

50 శాతం ఓట్లు మాకేనంటూ.. టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ.. కేటీఆర్ ఫుల్ ఖుషీయా?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : హుజుర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ.. ఈ స్థానంలో పాగా వేయడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. పార్టీలోని మందీ మార్బలాన్ని అక్కడే మోహరించి ఆ ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కారు ఖాతాలో వేసేందుకు అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా హుజుర్ నగర్ బై పోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గెలుపు కోసం అలుపెరగని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీకి చెందిన జిల్లా నేతలను ఏకతాటిపైకి తెచ్చి జయకేతనం ఎగురవేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అదలావుంటే మంత్రి కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

హుజుర్ నగర్ పై టీఆర్ఎస్ కన్ను

హుజుర్ నగర్ పై టీఆర్ఎస్ కన్ను

హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానంపై కన్నేశారు టీఆర్ఎస్ పెద్దలు. అక్కడ గెలిచి తీరాలనే కసితో కనిపిస్తున్నారు. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు గాను 88 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి బంపర్ మెజార్టీ సాధించినా.. ఆ ఒక్క సీటు గెలిస్తే తప్ప కిక్కు ఉండదనే రీతిలో వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోటైన హుజుర్ నగర్‌లో గులాబీ జెండా ఎగిరేలా అస్త్రశస్త్రాలు సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి.

ఆర్టీసీ విలీనం టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో లేదే : మంత్రి తలసానిఆర్టీసీ విలీనం టీఆర్ఎస్ ఎన్నికల మెనిఫెస్టోలో లేదే : మంత్రి తలసాని

పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్

పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్

హుజుర్ నగర్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ ఇన్‌ఛార్జ్‌లతో పాటు సీనియర్ నేతలతో శనివారం నాడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్. అక్కడ జరుగుతున్న ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలు అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలని.. ప్రతి విషయం సునిశితంగా పరిశీలించాలని వారికి దిశానిర్దేశం చేశారు. ఎవ్రీ మూమెంట్ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. అదలావుంటే టీఆర్ఎస్ నిర్వహించిన సర్వేలో కారు జోరు ఫుల్లుగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కన్నా టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు సర్వే రిపోర్టులు వచ్చాయని వివరించారు. ప్రజా స్పందన టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందన్నారు.

ప్రచారంపై సంతృప్తి.. కారు గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా

ప్రచారంపై సంతృప్తి.. కారు గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా

హుజుర్ నగర్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం సంత‌ృప్తిగా ఉందన్న కేటీఆర్.. రానున్న వారం రోజుల్లో మరింత ఉధృతం చేయాలన పార్టీ శ్రేణులకు సూచించారు. పక్కా ప్లాన్‌తో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లకు గండి పడిందని.. ఈసారి కూడా అలాంటి గుర్తులు ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఆ క్రమంలో కారు గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా డమ్మీ ఈవీఎంలను వాడుతూ ప్రచారం ముమ్మరం చేయాలన్నారు.

50 శాతం ఓట్లు కారు గుర్తుకే.. సర్వేలో తేలిందంటూ

50 శాతం ఓట్లు కారు గుర్తుకే.. సర్వేలో తేలిందంటూ

హుజుర్ నగర్ బరిలో కనీసం 50 శాతం ఓట్లు కారు గుర్తుకే పడతాయని తమ ఇంటర్నల్ సర్వేలో తేలిందని చెప్పుకొచ్చారు కేటీఆర్. తమకు వివిధ సామాజిక వర్గాల నుంచి ఫుల్ సపోర్ట్ ఉందన్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నికలతో బీజేపీ బలమేంటో కూడా తేలిపోతుందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో తమకు బలం లేదని తెలుసుకున్న బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తోందని ఆరోపించారు. ఈ రెండు పార్టీల దొంగచాటు బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని పార్టీ ఇన్‌ఛార్జ్‌లకు సూచించారు.

టికెట్ టికెట్.. ఆర్టీసీ బస్సుల్లో దోపిడీకి చెక్.. అవి వచ్చేస్తున్నాయట..!టికెట్ టికెట్.. ఆర్టీసీ బస్సుల్లో దోపిడీకి చెక్.. అవి వచ్చేస్తున్నాయట..!

కాంగ్రెస్‌తో అభివృద్ధి సాధ్యమా?

కాంగ్రెస్‌తో అభివృద్ధి సాధ్యమా?

టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌ కి లాభం.. కారు గుర్తుకు ఓటేస్తే హుజూర్‌ నగర్ అభివృద్ధి బాట పడుతుందన్న తమ ప్రచారానికి ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్ వస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు కేటీఆర్. ఇక టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా పోయిందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం లేని కాంగ్రెస్ పార్టీ.. హుజుర్ నగర్ అభివృద్ధికి ఏ విధంగా పాటు పడుతుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

English summary
ktr confidence to won huzurnagar assembly seat. he said that 50 percent votes will come to trs as their internal survey.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X