హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ మనసు పారేసుకున్న ఆ ఇల్లు ఎవరిది..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

KTR Likes A House In Kashmir & Tweets About It | Oneindia Telugu

హైదరాబాదు: ఒకరు మాజీ ముఖ్యమంత్రి తనయుడు... మరొకరు ముఖ్యమంత్రి తనయుడు. ఒకరిది ఉత్తర భారతదేశం మరొకరిది దక్షిణ భారత దేశం. దక్షిణ భారత దేశంలో ఉండే ముఖ్యమంత్రి తనయుడు... ఉత్తర భారతదేశంలో ఉండే మాజీ ముఖ్యమంత్రి తనయుడి ఇంటిపై మనసు పడ్డాడు. ఇంతకీ ఈ వ్యక్తులు ఎవరని అనుకుంటున్నారా... ఆ రాష్ట్రాలు ఏమిటని చూస్తున్నారా.. ఆ ఇళ్లు ఎవరిదో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే...

కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరి కేటీఆర్-జగన్ భేటీ కలకలం: సోషల్ మీడియాలో అభిమానుల యుద్ధభేరి

సుందరమైన ప్రదేశం కశ్మీర్


కశ్మీర్... భారతదేశంలో అత్యంత సుందరమైన ప్రదేశం. శీతాకాలం కావడంతో ఆ ప్రాంతం అంతా మంచుతో కప్పబడి ఉంది. ఈ సుందర దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు అనేలా ఉంటుంది. ఇక కశ్మీర్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య చెప్పక్కర్లేదు. ఆ ప్రాంతం విడిచి వెళ్లాలని వారికి ఉండదు. అంతలా తమ మనసును పారేసుకుంటారు. ఇక తెలంగాణలో కూడా ఓ ప్రముఖ వ్యక్తి కశ్మీర్‌లోని ఓ ఇంటిపై మనసు పారేసుకున్నారు.

ఒమర్ అబ్దుల్లా నివాసంపై మనసు పారేసుకున్న కేటీఆర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తారు. ఆయన ట్విటర్‌ను పరిశీలిస్తే కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. తాజాగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నివాసంపై తాను మనసుపడ్డట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. అంతకుముందు మంచుతో కప్పబడ్డ తన శ్రీనగర్ నివాసాన్ని ఒమర్ అబ్దుల్లా ఫోటో తీసి ట్వీట్ చేశారు. ఈ ఇంటిని కేటీఆర్ చూసి ముగ్ధుడయ్యారు. వెంటనే తనకు కూడా కశ్మీర్‌లో అలాంటి ఇళ్లు ఒకటి ఉంటే బాగుండును అనే కోరికను ట్వీట్ ద్వారా తెలిపారు.

కేటీఆర్ నా ఇల్లు నీ ఇల్లుగానే భావించండి

దీనికి ఒమర్ అబ్దుల్లా కూడా చాలా పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. తన నివాసానికి కేటీఆర్ ఎప్పుడైనా రావొచ్చని, ఎంత సేపైనా ఉండొచ్చని స్వాగతం పలికారు. తన నివాసాన్ని కేటీఆర్ తన సొంతింటిగా భావించి అక్కడ ఉండొచ్చని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు.

 ఒమర్ భాయ్.. నీ ఆఫర్‌ను సీరియస్‌గా తీసుకుంటా

ఒమర్ భాయ్.. నీ ఆఫర్‌ను సీరియస్‌గా తీసుకుంటా

తన ఇంటిని కేటీఆర్ సొంతింటిలా భావించి ఉండాలని ఒమర్ అబ్దుల్లా చేసిన ట్వీట్‌కు గులాబీ పార్టీ యువబాస్ కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా ఆఫర్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటాను.. తన ఇంటిని నిజంగానే తీసుకుంటానంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు. మొత్తానికి ఇద్దరి నేతల మధ్య ట్విటర్ వేదికగా జరిగిన సరదా సంభాషణలపై నెటిజెన్లు ఆసక్తి చూపారు. అంతేకాదు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నంలో ఉన్న సమయంలో ఇద్దరి నేతల మధ్య సరదా సంభాషణలు జరగడం ఆసక్తిని కలిగించాయి.

English summary
A picture of snow-capped house of former Jammu and Kashmir chief minister Omar Abdullah in Srinagar has bowled over ruling Telangana Rashtra Samithi (TRS) working president KT Rama Rao, who Wednesday expressed his wish to have a residence there.Abdullah responded by inviting Rao, son of Telangana chief minister K Chandrasekhar Rao, to stay in his house any time he wanted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X