కేటీఆర్ దేశంలో లేరు.. కేసీఆర్ రాష్ట్రంలో లేరు: కేఏ పాల్ సంచలనం
కేఏ పాల్ ఏ పార్టీని వదలడం లేదు. అన్నీ పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై కేఏ పాల్ ఫైరయ్యారు. కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారనిప్రశ్నించారు. కేటీఆర్ విదేశాల్లో ఎందుకు తిరుగుతున్నారు? కేసీఆర్ రాష్ట్రం వదిలి దేశంలో ఎందుకు తిరుగుతున్నారని నిలదీశారు. ప్రశాంత్ కిషోర్ చెప్పడంతోనే కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం రోజు రోజుకు అప్పుల మయం అవుతుందన్నారు. ఇప్పటికే ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని పేర్కొన్నారు.
కేసీఆర్ పై సీబీఐ ఎంక్వైరీ జరిగే అవకాశం ఉండటంతో మద్దతు కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారని పాల్ సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్‌లో ఒక్కరైనా ఉన్నారా..? అని ప్రశ్నించారు. కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్‌కి డబ్బులు అవసరం కనుకే కేసీఆర్‌తో కలుస్తున్నారని ఆరోపించారు. పార్ధసారధి రెడ్డి ఇంట్లో 500 కోట్లు రెండ్ హ్యాండెడ్ గా దొరికినా.. ఆయనకు టీఆర్ఎస్ రాజ్యసభ సీటు ఇచ్చిందన్నారు. బీజేపీ వాళ్లు పార్ధసారధికి రాజ్యసభ సీటు ఇవ్వడానికి నిరాకరించారని తెలిపారు.
పార్ధసారధి రెడ్డిపై సీబీఐకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ను ప్రశ్నించేవారు లేరన్నారు. కాంగ్రెస్‌లో ప్రశ్నించే ఇద్దరు, ముగ్గురికి నెలకి కోటి రూపాయలు ఇస్తున్నారు.. అందుకే ప్రశ్నించడం లేదని ఆరోపణలు చేశారు. 1200 అమరవీరుల కుటుంబాల్లో ఒక్కరు కూడ దొరకలేదా..? వేల కోట్లు ఇచ్చేవాళ్లు దొరికారా అని ప్రశ్నించారు. కేసీఆర్.. పార్ధసారధి రెడ్డిని కాపాడలేరు.. కేసీఆర్ కుటుంబాన్ని ఇప్పుడు కాపాడేవారే లేరని స్పష్టం చేశారు.

కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉంటే అమరవీరుల కుటుంబాల వారికీ సీట్లు ఇవ్వండి, అమరవీరుల కుటుంబాలకి డబ్బులు ఇవ్వండని సూచించారు. బీజేపీ మతతత్వ, అవినీతి పార్టీ.. ఆ పార్టీకి తమకు సంబంధం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ పాలనకు వచ్చిన 8 సంవత్సరాల్లో 50 లక్షల కోట్లు అప్పులు చేశారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో 7 లక్షల కోట్లు అప్పు ఉందన్నారు. ముందస్తు ఎన్నికలకు వస్తున్నారు అంటే వాళ్ళు దివాళా తీసినట్లేనని చెప్పారు. తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి చేయడంతోపాటు అప్పులు లేకుండా చేస్తానని తెలిపారు.
కేఏ పాల్‌పై ఇటీవల సిద్దిపేటలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పొలిటికల్‌గా బిజీ అయిపోయారు. సిద్ధిపేట జిల్లా జక్కపూర్ గ్రామంలో ఆయన చెంపచెల్ అనిపించాడు. కేఏ పాల్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో తంగళ్ల పల్లి మండలం బస్వాపూర్‌లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళుతున్నారు. పోలీసులు జక్కాపూర్ వద్ద అడ్డుకున్నారు. మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఓ యువకుడు దాడి చేశాడు. కేఏ పాల్‌ను చెంప మీద కొట్టాడు. దాడి చేసిన యువకుడితో కేఏ పాల్ అనుచరులు గొడవకు దిగారు. ఆ తర్వాత డీజీపీని కలిసే ప్రయత్నం చేయడం.. హౌస్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.