హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాట్ నెక్ట్స్: టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ, హుజురాబాద్ బై పోల్..

|
Google Oneindia TeluguNews

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నేతల చేరికతో బై పోల్ మరింత హీటెక్కింది. ఇటు ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఎన్నికలో ఎలాగైనా చేయాలని అనుకుంటున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభ్యర్థులనే ప్రకటించలేదు.. కానీ సామాజిక సమీకరణాల ఆధారంగా బలమైన అభ్యర్థుల కోసం చూస్తున్నాయి.

ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో ఇతర అంశాలు ఉన్నా.. ప్రధానంగా హుజురాబాద్ బై పోల్ గురించే చర్చ జరగనుంది. అభ్యర్థి, ప్రచారం, పథకాల గురించి ఎలా వివరించాలనే అంశంపై డీప్ డిస్కషన్ చేస్తారు. ప్రజల్లోకి వెళ్లి.. వారిని ఆకట్టుకోవడం కోసం ఏం చేయాలి.. ఇదివరకటి కన్నా ఓటు బ్యాంకు పెంచడంపై ఫోకస్ చేస్తారు.

ktr meet party general secretaries

దీంతోపాటు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా కేటీఆర్ డిస్కష్ చేస్తారు. పార్టీ జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణం, పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు బీమా సదుపాయం గురించి మాట్లాడతారు. పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యక్రమాలు గురించి సలహాలు, సూచనలు తీసుకుంటారు. తర్వాత కార్యక్రమాల వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. దీంతోపాటు విపక్షాల తీరుపై స్పందించాల్సిన తీరు తదితర అంశాలపై ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Recommended Video

Bandi Sanjay, Revanth Reddy, YS Sharmila Padayatras కొత్త బిచ్చగాళ్ళు.. KTR

మిగతా అంశాలు ఉన్నా.. హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి గురించి మాట్లాడతారు. అందరినీ కలుపుకొని పోవాలని.. విజయం కోసం కృషిచేయాలని కోరతారు. బై పోల్ కోసం టీఆర్ఎస్‌లో ఆశవాహుల సంఖ్య పెరుగుతుంది.

English summary
trs working president ktr to meet party general secretaries today. they discuss about huzurabad by poll 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X