• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

‘టీఆర్ఎస్‌’కు కొత్త భాష్యం చెప్పిన కేటీఆర్: ప్రతిపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్, సిరిసిల్ల వరదలపై సమీక్ష

|

హైదరాబాద్: ప్రతిపక్ష పార్టీల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ కొంతమంది ఎగిరెగిరి పడుతున్నారని.. టీకాంగ్రెస్, టీబీజేపీ.. మీకు వచ్చిన పదవులు.. కేసీఆర్ పెట్టిన భిక్ష కదా? అని కేటీఆర్ ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు. హైదరాబాద్ జలవిహార్‌లో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలోని కార్యకర్తలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ప్ర‌తిపక్షాల విమ‌ర్శ‌ల‌ను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల‌కు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Rashi Khanna : బ్యాక్ లెస్ టాప్ తో సైడ్ అరాచకం.. అందాల విందు చేస్తున్న బొద్దుగుమ్మ (ఫొటోస్)

టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ పార్టీ అంటూ కేటీఆర్

టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ పార్టీ అంటూ కేటీఆర్


పేదల ఆశీర్వాదం ఉన్నంత కాలం టీఆర్ఎస్ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం మంత్రి కేటీఆర్ చేశారు. తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా 2001లో పార్టీ పెట్టిన కేసీఆర్.. త్యాగాల పునాదుల మీదనే ఉద్యమాన్ని చేపట్టారని తెలిపారు. గతంలో తెలంగాణ ఏర్పాటు కోసం ఎంతోమంది పోరాడినా సాధించలేకపోయారని, కేసీఆర్ వల్లనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని కేటీఆర్ కొత్త బాష్యం చెప్పారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. వ‌య‌సులో మీ కంటే 20 ఏళ్లు పెద్ద మ‌నిషిని ప‌ట్టుకుని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న పుట్టిన చిల్ల‌ర‌గాళ్లు ఎగిరెగిరి ప‌డుతున్నారు. పేరుకే ఢిల్లీ పార్టీలు కానీ.. చేసేవి మాత్రం చిల్ల‌ర ప‌నులు అంటూ ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. 60 ల‌క్ష‌ల పైచిలుకు స‌భ్యుల‌తో టీఆర్ఎస్ పార్టీ బ‌లంగా ఉంది. 33 జిల్లాల్లో జిల్లా పార్టీ కార్యాల‌యాలు క‌ట్టుకున్నాం. మొన్న ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌కు భూమిపూజ చేసుకున్నాం. ఇప్పుడు మ‌న ముందు ఏ ఎన్నిక లేదు. హుజూరాబాద్ ఉపఎన్నిక స‌మ‌స్య‌నే కాదు. ప్ర‌త్య‌ర్థుల విమ‌ర్శ‌లను ధీటుగా తిప్పికొట్టాల్సిన అవ‌స‌రం ఉంది. దాని కోసం సైన్యం ఉంటే స‌రిపోదు. ఇందుకు ఎక్క‌డిక‌క్క‌డ క‌మిటీలు ప‌టిష్టంగా ఉండాలి. జీహెచ్ఎంసీ ప‌రిధిలోకి వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క‌మిటీలు ఏర్పాటు చేసి ముందుకెళ్లాలి. ఈసారి జిల్లా క‌మిటీలు వేసుకోవాల‌ని కేసీఆర్ చెప్పారని కేటీఆర్ వెల్ల‌డించారు.

ప్రతిపక్షాలది పైశాచికానందం: కేటీఆర్

70 ఏళ్లలో ఈ తెలంగాణ‌ ప్ర‌జ‌ల‌కు క‌రెంట్, తాగునీరు ఇవ్వ‌లేని దౌర్బాగ్యం మీది. 24 గంట‌ల క‌రెంట్ తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? న‌ల్ల‌గొండ‌లో ఫ్లోరోసిస్ లేద‌ని కేంద్ర‌మే పార్ల‌మెంట్‌లో చెప్పింది.. అది తెలంగాణ‌కు గ‌ర్వ‌కార‌ణం కాదా? అని కేటీఆర్ అడిగారు. తెలంగాణ రైతులు సుభిక్షంగా ఉంటే.. ప్ర‌తిప‌క్షాలు జీర్ణించుకోలేక‌పోతున్నాయి. కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే బ‌రాబ‌ర్ స‌మాధానం చప్తాం. కుక్క కాటు చెప్పు దెబ్బ త‌ప్ప‌దు. ఓపిక ప‌ట్టినం.. సైలెంట్‌గా ఉండే కొద్ది మాట‌లు ఎక్కువైతున్నాయి అని ప్రతిపక్షాలపై కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. 2014లో 63 సీట్లు, ఆ తర్వాత వ‌చ్చిన గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో 12769 గ్రామ పంచాయ‌తీల‌కు గానూ.. 10 వేల గ్రామాల్లో గులాబీ జెండాలు ఎగిరాయి. జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లోనూ 32 జ‌డ్పీల‌ను కైవ‌సం చేసుకున్నాం. మ‌ళ్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 88 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు. కేసీఆర్ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌రిచారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 9 సీట్ల‌ను క‌ట్ట‌బెట్టారు. 142 మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే.. 135 మున్సిపాలిటీల్లో గులాబీ జెండాను రెప‌రెప‌లాడించారు. ఈ ఏడేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ప్ర‌జ‌లు నీరాజ‌నం ప‌లుకుతున్నారు. ప‌త్రిక‌ల్లో హెడ్‌లైన్స్ కోసం, పైశాచిక ఆనందం కోస‌మే ప్ర‌తిప‌క్షాలు ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు. వారిని ప్ర‌జ‌లు సీరియ‌స్‌గా తీసుకోవ‌డం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.

త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ..

త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ..

పార్టీలో క్రియాశీల‌కంగా ప‌ని చేసిన వారిని త‌ప్ప‌కుండా గౌర‌వించుకుంటామని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ద‌వులు రాక కొంత మంది నిరాశ‌తో ఉన్నారు. తొంద‌ర్లోనే 500 నామినేటెడ్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తాం. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కో ఆప్ష‌న్ స‌భ్యుల‌ను నియామ‌కం కూడా పూర్తి చేస్తాం. పార్టీ గౌర‌వాన్ని పెంచే విధంగా ప‌ని చేయాలి. బ‌స్తీ, డివిజ‌న్ క‌మిటీల‌కు ఇచ్చే ప్రాధాన్య‌త‌ను సోష‌ల్ మీడియా క‌మిటీల‌కు ఇవ్వాలి. సోష‌ల్ మీడియా క‌మిటీల‌కు కూడా శిక్ష‌ణ ఇవ్వాలి. ఇత‌ర ఏ పార్టీకి లేని విధంగా ఒక కార్యాల‌యాన్ని నిర్మాణం చేసుకుందామ‌ని కేటీఆర్ తెలిపారు. ద‌స‌రా, దీపావ‌ళి త‌ర్వాత క‌మిటీల‌కు శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌పై విస్తృత అవ‌గాహ‌న క‌ల్పిస్తామ‌న్నారు కేటీఆర్.

  Special Report on Trs Party Flag Festival | Oneindia Telugu
  జల దిగ్బంధంలో సిరిసిల్ల.. మంత్రి కేటీఆర్ సమీక్ష

  జల దిగ్బంధంలో సిరిసిల్ల.. మంత్రి కేటీఆర్ సమీక్ష

  ఇది ఇలావుండగా, వర్షాలతో జల దిగ్బంధంలో చిక్కుకున్న సిరిసిల్లలో త్వరితగతిన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్ష బాధితుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కేటీఆర్ ఆదేశించారు. వరదల దృష్ట్యా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా యంత్రాగాన్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రజలెవ‌రూ ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ కాగా, మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా వేములవాడలో 213 మిల్లీమీటర్లు, సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 174 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. కరీంనగర్‌ - కామారెడ్డి రహదారితో పాటు వెంకంపేట రోడ్‌పై వరద ప్రవహిస్తోంది. పలు కాలనీలు నీటమునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ సమీక్ష చేపట్టి అధికారులకు మార్గదర్శనం చేశారు.

  English summary
  KTR review on Sircilla floods: slams opposition leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X