హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా : కేటీఆర్‌ను మందు కోరిన ఆర్జీవీ.. మంత్రి మామూలు కటింగ్ ఇవ్వలేదుగా

|
Google Oneindia TeluguNews

తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో నిర్వహించిన #askKTRలో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాక్ డౌన్ పీరియడ్‌లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతిచ్చారని.. తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్,మంత్రి కేటీఆర్‌లు నిర్ణయం తీసుకోవాలని కోరారు.

'చాలామంది బోర్‌గా ఫీల్ అవుతున్నారు. జుట్టు పీక్కుంటున్నారు.. చిన్నపిల్లల్లా ఏడుస్తున్నారు. మానసిక సమస్యలతో మెంటల్ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. కొంతమంది ఫ్రస్టేషన్‌లో భార్యలపై కూడా దాడులు చేస్తున్నారు. మీరు కూడా వీరి పట్ల మమతా బెనర్జీ లాగా పెద్ద మనసు చాటుకోవాలి.' అని కేటీఆర్‌కు వర్మ విజ్ఞప్తి చేశారు. వర్మ ట్వీట్‌పై ఫన్నీగా స్పందించిన కేటీఆర్.. 'రాము గారు, మీరు చెబుతున్నది హెయిర్ కట్ గురించే కదా..' అని సెటైర్ వేశారు. ఈ ట్వీట్‌పై చాలామంది నెటిజెన్స్.. కేటీఆర్ అదిరిపోయే పంచ్ వేశారని కామెంట్ చేస్తున్నారు.ఇక ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విషయమేంటంటే... పశ్చిమ బెంగాల్ సర్కార్ లాక్ డౌన్ పీరియడ్‌లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించిందన్నది ఫేక్ న్యూస్. ప్రభుత్వం ఈ ప్రచారాన్ని కొట్టిపారేసింది. అందులో నిజం లేదని స్పష్టం చేసింది.

 ktr satirical punch on ramgopal varma request over liquor home delivery

#askKTRలో చాలామంది ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా సమాధానం చెప్పారు. లాక్ డౌన్ పొడగించడమే సరైందని ఓ నెటిజెన్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పదో తరగతి పరీక్షలపై సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 'సార్,డిగ్రీ తర్వాత మీరు సినిమాల్లో ఎందుకు ప్రయత్నించలేదు..' అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు.. 'ఇలా నన్నెవరూ అడగలేదు..' అంటూ రిప్లై ఇచ్చారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ అడిగిన వెంటనే స్పందిస్తున్నందుకు చాలామంది నెటిజెన్స్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు,శ్రద్దపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Recommended Video

Lockdown : Telangana CM KCR Favours Extension Of National Lockdown

English summary
Telangana IT Minister KTR made a satirical punch on director Ramgopal Varma for his requrest of liquor home delivery like West Bengal government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X