• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

త్వ‌ర‌లో కేటీఆర్ కు తెలంగాణ పూర్తి బాద్య‌త‌లు..! నిర్థారిస్తున్న ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు..!

|

హైద‌రాబాద్: తెలంగాణ‌లో యువ‌రాజు ప‌ట్టాభిషేకానికి స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్టు తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు జాతీయ రాజ‌కీయాల‌వైపు ద్రుష్టి కేంద్రీక‌రిస్తున్న త‌రుణంలో తెలంగాణ పూర్తి బాద్య‌త‌ల‌ను త‌న‌యుడు తార‌క రామారావుకు అప్ప‌జెప్పాల‌నే యోచన‌లో కేసీఆర్ ఉన్న‌ట్టు స‌మాచారం. దీంతో అల్లుడు హ‌రీష్ రావును కూడా దేశ రాజ‌కీయాల్లోకి తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చేయాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే అంశాన్ని తెలంగాణ లో కొంత మంది ఎమ్మెల్యేలు సైతం నిర్ధారిస్తున్నారు. దీంతో కేటీఆర్ తెలంగాణ ప‌గ్గాలు చేప‌ట్ట‌డానికి ఎక్కువ రోజుల స‌మ‌యం ప‌ట్ట‌ద‌నే చ‌ర్చ కూడా జ‌రుగుతోంది.

తెలంగాణ‌లో రెండోసారి అదికారంలోకి టీఆర్ఎస్..! దేశ రాజ‌కీయాల్లో దూకుడు పెంచిన కేసీఆర్..!

తెలంగాణ‌లో రెండోసారి అదికారంలోకి టీఆర్ఎస్..! దేశ రాజ‌కీయాల్లో దూకుడు పెంచిన కేసీఆర్..!

ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో జైత్రయాత్రను కొనసాగించి 119 స్థానాలకు గానూ, 88 నియోజకవర్గాల్లో విజయం సాధించింది గులాబీ పార్టీ. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన ప్రజాకూటమి 21 స్థానాలకే పరిమితమవగా, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంతో సరిపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో విజయం తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆయన బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు.

జాతీయ రాజ‌కీయాల వైపు కేసీఆర్ ద్రుష్టి..! గుణాత్మ‌క‌మైన మార్పు దిశ‌గా అడుగులు..!

జాతీయ రాజ‌కీయాల వైపు కేసీఆర్ ద్రుష్టి..! గుణాత్మ‌క‌మైన మార్పు దిశ‌గా అడుగులు..!

దీంతో ఆయన పరోక్షంగా కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయబోతున్నారని అంతా అర్థం చేసుకున్నారు. ఇదే జరిగే తర్వాత ఎదురయ్యే పరిణామాలను కూడా గ్రహించిన కేసీఆర్.. తన మేనల్లుడు, మాజీ మంత్రి హరీశ్ రావును తనతో పాటు జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా, కేటీఆర్‌ను సీఎం చేయాలనే డిమాండ్‌ను ఆ పార్టీ నేతలు తెర పైకి తీసుకువస్తున్నారు. ఇది కూడా ప్లాన్‌లో భాగమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.

కల్వకుర్తిలో "గులాబీ ముల్లు".. నేతల మధ్య డిష్యుం డిష్యుం.. కేటీఆర్ ఏమంటారో?

తెలంగాణ బాద్య‌త‌లు కేటీఆర్ కే..! తెర వెన‌క వేగంగా క‌దులుతున్న పావులు..!!

తెలంగాణ బాద్య‌త‌లు కేటీఆర్ కే..! తెర వెన‌క వేగంగా క‌దులుతున్న పావులు..!!

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు.. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో అమలవుతున్నాయని, ఈ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ అమలు కావాలంటే కేసీఆర్‌ దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని. అప్పుడు రాష్ట్రంలో యువనేత కేటీఆర్‌ క్రియశీలంగా వ్యవహరించే అవ‌కాశం ఉంటెంద‌ని, అంతే కాకుండా అన్నీ కలిసివస్తే కేసీఆర్‌ ప్రధానమంత్రి, కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని, అప్పుడు తెలంగాణ అభివృద్ధికి మార్గం సుగమం అవుతుందని అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ త‌న మ‌నో భావాల‌ను వ్య‌క్తం చేసారు. ఇక మరో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూడా ఈ తరహా అభిప్ర‌యాన్నే వ్య‌క్తం చేశారు.

త‌ర్వాత సీయం కేటీఆరే..!! నిర్థారిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేలు..!!

త‌ర్వాత సీయం కేటీఆరే..!! నిర్థారిస్తున్న తెలంగాణ ఎమ్మెల్యేలు..!!

జాతీయరాజకీయాల్లో కేసీఆర్‌ పాత్ర కీలకమైనప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సారథ్యం వహించాల్సిన బాధ్యత కేటీఆర్‌కుందని. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు నిర్వహిస్తూనే, ఈ రాష్ట్రానికి కేటీఆర్‌ సీఎం బాధ్యతలు కూడా నిర్వహించాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ ఉందని, ఇప్పటికే ఏనాడూ లేనివిధంగా వారి నాయకత్వంలో మెజారిటీ వచ్చి హైదరాబాద్‌లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ కొలువుదీరిందని. అలాగే వారి నాయకత్వంలో సాధారణ ఎన్నికల్లో కూడా అధిక మెజారిటీ సాధించాంమ‌ని. ప్రజల ఆమోదం ఉన్న యువ నాయకుడిగా రాష్ట్ర బాధ్యతలు కూడా తీసుకొనే విధంగా తాము విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని ఆయన వ్యాఖ్యనించారు. దీంతో యువ‌రాజుగా కేటీఆర్ ప‌ట్టాభిషేకానికి ఎక్కువ‌రోజులు స‌మ‌యం ప‌ట్ట‌క పోవ‌చ్చ‌నే అభిప్రాయ‌లు వ్య‌క్తంమ‌వుతున్నాయి.

English summary
Chief Minister Chandrasekhar Rao has been focussing on national politics, while Telangana responsibilities has been asked to give his son Taraka Rama Rao. Hareesh Rao has also been taken to the national politics and wants to make KTR the Chief Minister of Telangana. There are some MLAs confirning the same too.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X