హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేటీఆర్ వర్సెస్ భట్టి : సభలో హీట్ పెంచిన ఆ కామెంట్, క్షమాపణకు డిమాండ్, భట్టి నో

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క, సీఎం కేసీఆర్, మంత్రుల మధ్య హాట్ హాట్ చర్చ జరిగింది. ప్రాజెక్టుల వ్యయం, పూర్తిచేయకపోవడంపై భట్టి ప్రశ్నించారు. మేడిగడ్డ నుంచి చుక్క నీరు రాలేదని భట్టి అనడంతో తెలంగాణ మంత్రులంతా స్పందించారు.

చుక్కనీరివ్వలేదు ...

చుక్కనీరివ్వలేదు ...

మేడిగడ్డ నుంచి చుక్కనీరు కూడా పంప్ చేయలేదన్నారు భట్టి విక్రమార్క. ఆ 12 టీఎంసీలను అన్నారం లిఫ్ట్ నుంచి తీసుకొచ్చారని .. అన్నారం లిప్ట్‌కు సుందిళ్ల నుంచి తీసుకొచ్చారని పేర్కొన్నారు. దీంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి కల్పించుకొన్నారు. ఎల్ ఎండీ, వరదకాలు, శ్రీపాద ఎల్లంపల్లి వరకు నీరు వచ్చిందని .. దారి పొడవునా చెరువులను నింపామని పేర్కొన్నారు. ఎల్ ఎం డీ 15 టీఎంసీలు, చెరువులకు 10 టీఎంసీలు లిప్ట్ చేశామని పేర్కొన్నారు. మరో మంత్రి గంగుల కమలాకర్ స్పందిస్తూ ఎల్లంపల్లి వరద వచ్చేసరికే మిడ్ మానేరు నిండిపోయిందని చెప్పారు. 22 ఏళ్ల క్రితం నిండని చెరువులను 120 చెరువులకు జలకళ వచ్చిందన్నారు. ఇందుకు తానే సాక్షి అని పేర్కొన్నారు.

అదీ కాదు ..

అదీ కాదు ..

మంత్రుల వాదనతో భట్టి విభేదించారు. కళ్ల నిండ చూశారు కానీ .. వరద రాగానే విడుదల చేశారని చెప్పారు. తాను చెప్పే అంశాలకు సంబంధించి రికార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. పాత ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. తర్వాత మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారని భట్టి అనడంతో .. మంత్రి కేటీఆర్ కల్పించుకున్నారు. భట్టి అసత్యాలను వల్లెవేస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని తాము చెప్పలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. దానికి సంబంధించి రుజువు చేయాలని కోరారు. లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, మంత్రులు, సభకు సమాధానం చెప్పాలన్నారు. ఇరిగేషన్, బడ్జెట్, ఉద్యోగాల పేరుతో అసత్యాలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.

కేటీఆర్ వర్సెస్ భట్టి

కేటీఆర్ వర్సెస్ భట్టి

కేటీఆర్‌కు కూడా భట్టి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తానేమి బానిసను కాదన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని .. బహిరంగ సభల్లో కేసీఆర్ చెప్పినా విషయాన్ని గుర్తుచేశారు. సభలో బెదిరించడం ఏంటి అని .. ఇది కరెక్ట్ కదాన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష 7 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినా విషయం మరచిపోయారా అని నిలదీశారు.

English summary
During the debate on the budget, there was a heated debate between Congress leader Bhatti Vikramarka, CM KCR and ministers. Bhatti questioned the cost and non-completion of the projects. Telangana ministers responded by saying that the aquarium water did not come from the meadow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X