• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఆహ్వానం ఉన్నవారికే అనుమతి, ఐడీ కార్డులు కూడా: హైటెక్స్‌లో టీఆర్ఎస్ ప్లీనరీపై కేటీఆర్ సమీక్ష

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అక్టోబర్ 25న హైటెక్స్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ ఏర్పాట్లను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్ఎస్ నేతలు, వివిధ విభాగాల అధికారులతో భేటీ అయ్యారు. ప్లీనరీపై చర్చించారు.

అనంత‌రం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 25న టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక ఉంటుంది. ప్లీనరీ సజావుగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. సభ నిర్వహణ, ఏర్పాట్లు, ఆహ్వాన కమిటీ, వేదిక ప్రాంగణం అలంకరణం, నగర అలంకరణ, ప్రతినిధుల నమోదు, పార్కింగ్, భోజన, తీర్మానాలకు పార్టీ తరపున కమిటీలు పనిచేయనున్నాయి. ప్రతినిధులకు పార్టీ తరపున గుర్తింపు కార్డులు అందిస్తామని, ఆహ్వానం ఉన్నవారే సమావేశానికి హాజరుకావాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR visits Hitech, review on TRS Plenary.

అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ సాధించుకున్నామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. త‌మ పార్టీ విధానాల‌ను, ప‌రిపాల‌న‌ను మెచ్చి ప్ర‌జ‌లు మ‌రోసారి ఆశీర్వ‌దించారు అని పేర్కొన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వ ప‌రిపాల‌న గొప్ప‌గా సాగుతుంద‌ని, అపూర్వ‌మైన విధానాల‌తో, పాల‌సీల‌తో దేశంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచామ‌ని తెలిపారు కేటీఆర్.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం పథకాలను, కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నారని చెప్పారు. రైతుబంధు, మిష‌న్ భ‌గీర‌థ‌ ప‌థ‌కాన్ని స్ఫూర్తిగా తీసుకొని పీఎం కిసాన్‌, జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌ను కేంద్రం ప్రారంభించింద‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతున్న‌ద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేది... కానీ ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తుందో.. రేపు భారత్ అదే చేస్తుంది అన్నట్లుగా మారింద‌న్నారు కేటీఆర్.

నవంబర్‌లో విజయగర్జన

టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 'ద్విదశాబ్ది ఉత్సవాలు' నిర్వహించనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు రెండ్రోజుల క్రితం తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్‌ 15న వరంగల్‌ వేదికగా 'తెలంగాణ విజయ గర్జన' పేరిట లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌ రెండు దశాబ్దాల ప్రస్థానం, కార్యకర్తల శ్రమను గుర్తు చేసుకోవడంతోపాటు, ప్రజల ఆశీర్వాదంతో రెండు పర్యాయాలు అధికారం చేపట్టి, సాధించిన విజయాలను మరోసారి దేశానికి చాటి చెప్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందని చెప్పారు. ఉద్యమ పార్టీగా ఎన్నో సవాళ్లను, ఆటుపోట్లను, చాలెంజ్‌లను అధిగమించి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంలో రాజకీయ శక్తిగా ఎదిగింద న్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో దేశ రాజకీయ వ్యవస్థను శాసించి తెలంగాణను ఎలా సాధించుకున్నామో అందరికీ తెలుసు. కేసీఆర్‌ నాయకత్వంలోనే తెలంగాణ బాగు పడుతుందని ప్రజలు 2014లో అధికారాన్ని అప్పగించారు. అప్పటి నుంచి సంక్షేమాన్ని, అభివృద్ధిని కలెగలిపి జోడెడ్లలా జనరంజక పాలన అందించాం,ఫలితంగా 2018లో మళ్లీ భారీ మెజారిటీతో రెండోసారి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వం ఉండాలని దీవించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తెలంగాణ విజయగర్జనకు ప్రజలు, కార్యకర్తలు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని వరంగల్‌కు రావాలని లక్షల్లో తరలిరావాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. విజయ గర్జనకు సీఎం కేసీఆరే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌. వారి నాయకత్వంలోనే రాష్ట్రం వచ్చింది. ఇవ్వాళ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్‌ స్పష్టం చేశారు. విజయగర్జన సభ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాలు మొదలు పెడుతామని, ఆ తర్వాత కార్యకర్తలకు శిక్షణాశిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు.

English summary
KTR visits Hitech, review on TRS Plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X