హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీస్ స్పెషల్.. మహిళల కోసం, మహిళల చేత 'మెట్రో' ఎగ్జిబిషన్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : వ్యాపారం చేయడమంటే ఆషామాషీ కాదు. వస్తువుల ధర, మన్నిక.. జనాలను ఆకట్టుకోవడం తదితర తతంగాలు ఎన్నో ఉంటాయి. ఆ క్రమంలో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి సదరు కంపెనీలు పలు రకాలుగా ప్రమోట్ చేసుకుంటాయి. మార్కెటింగ్, యాడ్స్, హోర్డింగ్స్.. అలా కస్టమర్లను ఆకట్టుకోవడానికి సవాలక్ష కార్యక్రమాలు చేపడతాయి. కాస్తా అటు ఇటుగా అలాంటి నేపథ్యం అందిపుచ్చుకుంటున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు. దేశంలోనే మొదటిసారిగా మహిళల కోసం, మహిళల చేత మహిళా ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

మహిళలకు ప్రత్యేకం

మహిళలకు ప్రత్యేకం

హైదరాబాద్ మెట్రో రైల్ (HMR) అధికారులు మహిళల కోసం ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. 60 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్.. తరుణి మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో కొలువుదీరనుంది. త్వరలోనే మహిళా ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు హెచ్‌ఎంఆర్‌ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి.

తరుణి మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో.. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో మహిళా ఎగ్జిబిషన్ కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేస్తామన్నారు. లింగ సమానత్వం, మహిళ సాధికారత పెంచడం కోసం ఈ కార్యక్రమం తీసుకున్నట్లు వివరించారు.
మహిళలతో పాటు చిన్నారులకు అవసరమయ్యే అన్ని రకాల వస్తువులు లభించేలా స్టాల్స్ ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్ కు వచ్చే మహిళలను ఎంకరేజ్ చేయడానికి వివిధ రకాల కాంపిటీషన్స్ నిర్వహిస్తామన్నారు.

కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా? కవిత గెలుపుకోసం కేసీఆర్ పాచికనా?.. మండవకు గులాబీ తీర్థం పక్కా స్కెచ్చేనా?

 తరుణి ఫెయిర్.. మహిళా సాధికారతే లక్ష్యం

తరుణి ఫెయిర్.. మహిళా సాధికారతే లక్ష్యం

'తరుణి ఫెయిర్' పేరిట దేశంలోనే తొలిసారిగా నిర్వహించనున్న మహిళా ఎగ్జిబిషన్ ను ప్రతిషాత్మకంగా తీసుకున్నారు మెట్రో అధికారులు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారికి ఉచిత ప్రవేశంతో పాటు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా స్టాల్స్ ఏర్పాటుకు అవకాశం కల్పించారు. దాదాపు 150 స్టాల్స్ ఈ ప్రదర్శనలో కొలువుదీరనున్నాయి. మహిళలు, చిన్నారులకు అవసరమయ్యే అన్నిరకాల వస్తువులు ఇక్కడి స్టాల్స్ లో దొరుకుతాయి. వివిధ రకాల దేశ, విదేశీ వంటకాల రుచులు అందించడానికి ఫుడ్‌కోర్టులు కూడా సిద్ధం చేయనున్నారు.

ఎగ్జిబిషన్ సందర్శకులకు బోర్ కొట్టకుండా సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేయనున్నారు. వివిధ సంప్రదాయ కళా ప్రదర్శనలకు చోటు కల్పించారు. ఇక చిన్నారుల ఆట పాటకు సంబంధించి ప్రత్యేకంగా ప్లే ఏరియా, గేమ్స్ తదితర సౌకర్యాలు సమకూర్చనున్నారు. 100 కార్లతో పాటు 1000 టూవీలర్స్ వరకు పార్కింగ్ చేసుకునే ఛాన్సుంది. మరోవైపు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ఫైర్ సేఫ్టీ తదితర అంశాల్లో అన్నీ జాగ్రత్తలు తీసుకోనున్నారు మెట్రో అధికారులు.

స్టాల్ పెడతారా?.. అయితే కాంటాక్ట్ చేయండి

స్టాల్ పెడతారా?.. అయితే కాంటాక్ట్ చేయండి

ఎగ్జిబిషన్ కు వచ్చే సందర్శకుల కోసం వివిధ రకాల పోటీలు కూడా నిర్వహించనున్నారు. మహిళలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చాగోష్టి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ముగ్గులు, వంటల పోటీలు కూడా భాగం కానున్నాయి. చిన్నారులకు సైతం డ్రాయింగ్, పెయింటింగ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నారు.

తరుణి ఎగ్జిబిషన్‌లో స్టాల్స్‌ ఏర్పాటు చేయాలనుకునే మహిళలకు.. హైదరాబాద్ మెట్రో అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు మిగతా వివరాల కోసం HMRL ఎస్టేట్ మేనేజర్ సయ్యద్‌ అబ్దుల్‌ మాజిద్‌ ను మొబైల్ నెంబర్ 77028 00944 కు ఫోన్ చేయొచ్చు. అలాగే జీఎం రాజేశ్వర్ కూడా మొబైల్ నెంబర్ 80084 56866 ద్వారా అందుబాటులో ఉంటారు. పూర్తి వివరాలకు మెట్రో రైల్ వెబ్ సైట్ https://hmrl.co.in చూడండి.

English summary
The Hyderabad Metro Rail Limited (HMRL) will be conducting a 60-day women-centric exhibition at the Taruni Madhuranagar station, which is perhaps the first-ever station in India which is managed by women only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X