హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ కాదు కిలాడీ.. సాఫ్ట్‌వేర్ బ్రహ్మీని నిండా ముంచిదిగా..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ : భాగ్యనగరంలో లేడీ కిలాడీలు రెచ్చిపోతున్నారు. నమ్మినవారిని నట్టేట ముంచుతూ లక్షలు కొట్టేస్తున్నారు. రోజుకో కొత్త దారిలో అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఓ లేడీ కిలాడీ మోసం చేసిన తీరు చర్చానీయాంశమైంది. అతని ద్వారా సాయం పొందడమే గాకుండా 14 లక్షల రూపాయలు కాజేసింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆపదలో ఉన్నట్లు కనిపించిన సదరు లేడీకి సాయం చేయడమే అతడి తప్పైంది.

 ఎరక్కపోయి ఇరుక్కుపోయాడుగా..!

ఎరక్కపోయి ఇరుక్కుపోయాడుగా..!

జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జయంత్.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ మధ్య తన భార్య స్వగ్రామం వెళ్లే క్రమంలో విమానం ఎక్కించడానికి శంషాబాద్ అంతర్జాతీయ విమానశ్రయానికి వెళ్లారు. అయితే ఎయిర్‌పోర్టు నుంచి బయటకొచ్చే క్రమంలో ఓ లేడీ కంగారుగా కనిపించింది. ఏంటా అని ఆరా తీస్తే.. చేతిలో డబ్బుల్లేవని, ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా కావడం లేదని దీనంగా చెప్పింది.

ఆ మేరకు సదరు మహిల డెబిత్ కార్డుతో ఓసారి ట్రై చేశాడు జయంత్. నిజంగానే డబ్బులు రాకపోవడంతో.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పోనీలే, ఇబ్బందులు పడుతోందని ఓ ఐదువేలు రూపాయలు క్యాష్ ఇచ్చాడు. అదే అతడి పట్ల శాపమైంది.

వాట్ ఏ గలీజ్ దందా.. లిక్కర్ ప్రొడక్షన్‌లో రేషన్ బియ్యం..!<br />వాట్ ఏ గలీజ్ దందా.. లిక్కర్ ప్రొడక్షన్‌లో రేషన్ బియ్యం..!

సాయం చేశాడు.. ఉల్టా మోసపోయాడు

సాయం చేశాడు.. ఉల్టా మోసపోయాడు

పరిచయం లేకున్నా.. తనకు సాయం చేసిన జయంత్‌కు థ్యాంక్స్ చెప్పిన సదరు లేడీ వెళుతూ వెళుతూ అతడి ఫోన్ నెంబర్ తీసుకుంది. అయితే ఆ విషయం మరచిపోయి ఆఫీస్ పనిలో బిజీ అయిపోయిన జయంత్‌కు.. రెండు రోజుల తర్వాత లండన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. తీరా చూస్తే ఆ రోజు తాను సాయం చేసిన లేడీ గొంతు వినిపించింది.

మీరు చేసిన సాయానికి నేను పెద్ద గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నమ్మించింది. కష్టకాలంలో తనను ఆదుకున్నందుకు ఈ నజారానా అంటూ ఊరించింది. లండన్ నుంచి 80 వేల బ్రిటన్ పౌండ్లు, వజ్రాలు, బంగారం పార్సిల్ పంపిస్తున్నట్లు తీయగా మాట్లాడింది. అక్కడ సీన్ కట్ చేస్తే.. మరో రెండు రోజుల తర్వాత మళ్లీ ఆ కిలాడీ ఫోన్ చేసింది. తాను పంపిన పార్సిల్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారుల దగ్గర ఉందని.. ట్యాక్స్ కట్టి విడిపించుకోవాలని సూచించింది.

 కస్టమ్స్ అధికారినంటూ ఫోన్.. దశలవారీగా శఠగోపం

కస్టమ్స్ అధికారినంటూ ఫోన్.. దశలవారీగా శఠగోపం

అలా ఆ మాయలేడీ ఫోన్ పెట్టేసిందో లేదో మరొకడు జయంత్‌కు ఫోన్ చేశాడు. తనకు తాను ఢిల్లీ విమానాశ్రయ కస్టమ్స్‌ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీకు వచ్చిన పార్సిల్ తీసుకోవాలంటే ట్యాక్స్ కట్టాల్సి ఉంటుందని వివరించాడు. అలా అదంటూ ఇదంటూ విడతలవారీగా 14 లక్షల రూపాయలు కాజేశారు. అంత పెద్ద మొత్తంలో వసూలు చేసిన కూడా.. ఇంకా డబ్బులు కావాలంటూ ఫోన్ చేశారు. అప్పటికి గానీ జయంత్‌కు అసలు విషయం అర్థం కాలేదు. చివరకు తనను మోసం చేశారని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

English summary
One Lady Cheated Hyderabad Based Software Engineer For 14 Lakh Rupees. She helped by him in shamshabad airport with five thousand rupees once a time. She taken his phone number and called later. She expressed her feelings with lots of thanks and told that sending a gift from london. For that parcel, he cheated about 14 lakhs in the name of different taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X