• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Hyderabad:ఆది, సోమ ట్రాఫిక్ ఆంక్షలు -లాల్ దర్వాజ బోనాలు -వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఇలా

|

తెలంగాణకే ప్రత్యేకమైన బోనాలు పండుగ ముగింపు దశకు వచ్చింది. ప్రధానంగా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జరిగే బోనాలు పడుగను ఈఏడాది కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహిస్తున్నారు. లాల్ దర్వాజ బోనాలు సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో(ఆగస్ట్ 1, 2 తేదీల్లో) ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించిన వివరాలివే..

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

చైనాలో మళ్లీ కరోనా విలయం -బీజింగ్ సహా 15 ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ విజృంభణచైనాలో మళ్లీ కరోనా విలయం -బీజింగ్ సహా 15 ప్రధాన నగరాల్లో డెల్టా వేరియంట్ విజృంభణ

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

ఫలక్ నుమా, ఇంజన్ బౌలి నుంచి వచ్చే వాహనాలు అలియాబాద్ నుంచి షంషీర్ గంజ్ గోశాల తార్బన్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది.
కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్లో ట్రాఫిక్‌ను అనుమతించరు.
ఓల్డ్ చత్రినాక మీదుగా గొలిపురా వైపు మళ్లించనున్నారు.
ఉప్పుగూడ నుంచి ఛత్రినాక వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుంచి మొగలురా పీఎస్ వైపు మళ్లిస్తారు.

మీరా కా దయార మొఘలురా నుంచి హరిబౌలి క్రాసక్కు వచ్చే ట్రాఫిక్ను వాటర్ ట్యాంక్ ఏరియా మీదుగా డైవర్ట్ చేస్తారు.
చార్మినార్ మెయిన్ రోడ్, అస్రా హాస్పిటల్ నుంచి వచ్చే ట్రాఫిక్ను మొఘల్పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు
లాల్ దర్వాజ టెంపుల్, ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి
చార్మినార్ ఫలక్ సుమా, నయాపూల్ నుంచి ఓల్డ్ సీబీఎస్, అఫ్టల్ గంజ్, దారుసలాం క్రాస్ రోడ్స్ మీదుగా ఆర్టీసీ బస్సులను అనుమతించదు.

ఆర్టీసీ బస్సుల ఎలా తిరుగుతాయంటే

ఆర్టీసీ బస్సుల ఎలా తిరుగుతాయంటే

ఉప్పల్ నుంచి అంబర్ పేట్ మీదుగా ట్రావెల్ చేసే సిటీ బస్సులను హబ్సిగూడ, నార్నాక, అడిక్మెట్ విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, నింబోలి అడ్డా చాదర్ ఘాట్ మీదుగా సీబీఎస్ వైపు మళ్లిస్తారు.
ఉప్పల్ నుంచి అంబర్ పేట్ వైపు వచ్చే సిటీ బస్సులను గాంధీ విగ్రహం వద్ద సీపీవెల్ సల్లావా గేట్, టి- జంక్షన్, రోడ్ నం 6, అలీకేష్ మీదుగామళ్లిస్తారు.
నింబోలి అడ్లా మీదుగా దిల్సుఖ్నగర్, శివం రోడ్ నుంచి అంబర్ పేట వైపు వచ్చే బస్సులను అలీకేఫ్, జింటా తిలిస్మాత రోడ్, తిలక్నగర్ మీదుగా మళ్లిస్తారు.
నింబోలి అడ్డా నుంచి అంబర్పేట్ వైపు వచ్చే బస్సులను టూరిస్ట్ హోటల్స్, ఫీవర్ హాస్పిటల్, ఓయూ పై ఓవర్, తార్నాక మీదుగా మళ్లిస్తారు.

భక్తులకు పార్కింగ్ స్థలాలివే..

భక్తులకు పార్కింగ్ స్థలాలివే..

అలియాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను పోస్టాఫీస్కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్ లైన్, అల్కా థియేటర్ బహిరంగ ప్రదేశంలో పార్కు చేయాలి.
హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్, సుధా థియేటర్ లేన్, అల్క థియేటర్ ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేయాలి.
ఛత్రినాక ఓల్డ్ పీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్, సరస్వతి విద్యానికేతన్ - ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఫలక్నుమా పత్తర్ కి దర్గా సమీపంలో పార్కు చేయాలి.
మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుంచి వచ్చే వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్ పార్కు చేయాలి.
పండుగ వేళ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు విన్నవించారు.

English summary
In view of the Bonalu festival at the Mahankali Temple in Amberpet and Lal Darwaza bonalu, the Hyderabad Traffic Police have placed certain traffic curbs in its surroundings on Sunday and Monday. This apart, in connection with the Bonalu processions in the old city on Monday, there will be traffic curbs in Charminar, Mirchowk, Falaknuma and Bahadurpura areas from 12pm to 11pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X