హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వామ్మో.. నవ్వడం కూడా తప్పేనా.. క్లాస్‌ రూంలో నవ్వాడని చేతులకు పనిచెప్పిన టీచర్...

|
Google Oneindia TeluguNews

తల్లి, తండ్రి తర్వాతి స్థానం గురువుదే. పిల్లలకు విద్యాబుద్దులు చెప్పాల్సిన కొందరు టీచర్లు పరిధి దాటుతున్నారు. మాటలతో చెప్పాల్సింది పోయి చేతులకు పనిచెబుతున్నారు. అభం శుభం తెలియని పిల్లలు టీచర్ల చేతిలో బడిత దెబ్బలు తింటున్నారు. ఎప్పుడూ ఒక చోట ఇలాంటి ఘటన జరుగుతూనే ఉంది. కానీ టీచర్ల తీరు మాత్రం మారడం లేదు. కొందరు ఉపాధ్యాయులు చేసే పని మిగతావారికి చెడ్డపేరు తీసుకొస్తుంది.

హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఇక్రా హైస్కూల్ ఉంది. పాఠశాలలో చాలా మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. అలానే అబ్దుల్ మజీద్ కూడా చేరాడు. ఏడో తరగతి చదువుతున్న మజీద్.. తరగతి గదిలో కాస్త సరదాగా ఉంటాడు. అలా అతను అల్లరి చేస్తుంటాడు. బుధవారం కూడా క్లాస్ రూంలో సరదాగా నవ్వాడు. అలా నవ్వడం తరగతి గదిలో ఉన్న టీచర్‌ జీషన్‌కు నచ్చలేదు. విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

laughing is a crime.. teacher slap to student

మాటలతో సరిపెట్టలేదు. చేతులకు పనిచెప్పాడు. మజీద్ వీపు విమాన మోత మోగించాడు. తరగతి గదిలో టీచర్ తనను కొట్టాడని విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. వారు టీచర్ తీరును తప్పుపట్టారు. పాఠశాలకెళ్లి ప్రధానోపాధ్యాయుడికి తెలిపారు. అంతటితో ఊరుకోకుండా పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు స్పందించారు. రొటిన్‌గా కేసు నమోదు చేయకుండా.. టీచర్, పేరెంట్స్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్థిని కొట్టొద్దని టీచర్‌కు.. టీచర్‌తో సమస్యను పాఠశాలలోనే పరిష్కరించుకోవాలని పేరెంట్స్‌కు చెప్పి పంపించివేశారు.

English summary
in a classroom students are not laughing?.someone behave like this.in hyderabad student laughing in a classroom. teacher beat the kid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X