హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాంతి భద్రతల పర్యవేక్షణకు ప్రయారిటీ, అసెంబ్లీ, మండలి వాయిదా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు సీఎం కేసీఆర్. ఇందుకోసం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చేస్తామని తన ప్రసంగంలో పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించామని తెలిపారు. అసెంబ్లీలో కేసీఆర్, మండలిలో హరీశ్‌రావు బడ్జెట్ ప్రసంగించాక ఉభయ సభలు వాయిదాపడ్డాయి. అసెంబ్లీ శనివారానికి, మండలి బుధవారానికి వాయిదాపడింది.

కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం .. కేంద్రానికి గత ఐదేళ్ళలో చెల్లించిన పన్ను ఎంతంటే !!కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం .. కేంద్రానికి గత ఐదేళ్ళలో చెల్లించిన పన్ను ఎంతంటే !!

శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం కొత్తగా ఏడు పోలీసు కమిషనరేట్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. 3 కమిషనరేట్లు కాస్త తొమ్మిదికి చేరాయన్నారు సీఎం కేసీఆర్. మరోవైపు పోలీసు సబ్ డివిజన్ల సంఖ్యను కూడా 139 నుంచి 163కు పెంచామని .. సర్కిళ్ల సంక్యను 688 నుంచి 717కి పెంచినట్టు వివరించారు. కొత్తగా 102 పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామని .. దీంతో రాష్ట్రంలో పోలీసు స్టేషన్ల సంఖ్య 814కి చేరిందని వివరించారు.

law and order are importanat says cm kcr

తెలంగాణ అసెంబ్లీలో సీఎం బడ్జెట్ ప్రసంగం ముగిసాక సభను స్పీకర్ శనివారానికి వాయిదా వేశారు. రేపు మొహర్రం, ఎల్లుండి ఓనమ్ సెలవు దినాలు కాగా .. గురు, శుక్రవారాల్లో సభ్యులు బడ్జెట్‌ను చదివి అర్థం చేసుకునేందుకు సమయం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ముందు ఉందని పేర్కొన్నారు. ఐదేళ్లలో అద్భుతమైన ప్రగతి సాధించిందని వివరించారు. శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి హరీశ్‌రావు. తమ ప్రభుత్వ ప్రాధామ్యాలను వివరించారు. మండలిలో హరీశ్ బడ్జెట్ ప్రసంగం తర్వాత మండలి బుధవారానికి వాయిదా వేశారు.

English summary
Strong measures will be taken to monitor the law and order, said KCR. In his speech, he said he would make big budgetary allocations. He said the police system had been reorganized. After the Budget was addressed in the KCR and Council in the Assembly, both Houses adjourned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X