ఇక్రిశాట్లో చిరుతపులి..అర్థరాత్రి పట్టివేత...!
హైదరాబాద్ ఇక్రిశాట్ అవరణలో సంచరిస్తున్న చిరుతపులిని అటవీశాఖ సిబ్బంది పట్టుకున్నారు..గత అర్థరాత్రి చిరుతకు మత్తుమందు ఇచ్చిన అటవీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు..అనంతరం చిరుతను నెహ్రు జూ పార్కుకు తరలించారు. ఇక అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు ,అనంతరం అటవీ ప్రాంతలో వదిలేసేందుకు అధికారులు నిర్ణయించారు.

అయితే ఇక్రిశాట్లో వ్యవసాయ పరిశోధనలు చేస్తున్న నేపథ్యంలోనే విశాలమైన స్థలం ఉండడంతో గత కొద్ది రోజులుగా వ్యవసాయ పరిశోధన క్షేత్రాల్లో తిరుగుతున్నట్టు అధికారులు తెలిపారు.. దీంతో దాన్ని పట్టుకునేందుకు చాల ప్రయత్నాలు చేసినప్పటికి గత అర్థరాత్రి మళ్లి రావడంతో అటవీ అధికారులు పట్టుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!