బాబుతో సహా తనకు ప్రాణహనీ: నీరజ్ భార్య సంజన.. క్యాండిల్ ర్యాలీ
ఇటీవల బేగం బజార్లో కూడా పరువు హత్య జరిగిన సంగతి తెలిసిందే. నీరజ్‌ను సంజన సోదరులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. పరువు హత్యపై నీరజ్ కుటుంబసభ్యులు సోమవారం మృతుడు నీరజ్ ఇంటి నుండి షాహినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ వరకు క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. నీరజ్ భార్య సంజన, కుటుంబ సభ్యులు, రాజస్తాన్, బీహార్, మహారాష్ట్ర నుంచి వచ్చిన మార్వాడి సమాజ్ సభ్యులు ర్యాలీలో పాల్గొన్నారు.

బిడ్డతో సహా తనకు ప్రాణ హానీ
తనకు, బిడ్డకు ప్రాణ హాని ఉందని సంజన వాపోయారు. తమను కూడా చంపేస్తారరని చెప్పింది. హత్య చేసిన వాళ్లు నాకు బంధువులే. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలి. పెళ్లి చేసుకున్న సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశాం. కానీ మమ్మల్ని పట్టించుకోలేదున్నారు. దీంతో భర్తను కోల్పోవాల్సి వచ్చిందని వివరించారు. యాదవ అహీర్ సమాజ్‌కు చెందిన వ్యక్తులతో నీరజ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేశారని నిందితులు తెలిపారు.యాదవ్ సమాజ్‌లో జరిగే కార్యక్రమాలకు సంజన కుటుంబ సభ్యులను పిలవని పరిస్థితులు నెలకొన్నాయని, ఎక్కడికి వెళ్లినా సంజన కుటుంబ సభ్యులు అవమాన భారంతో కుంగిపోయారని చెప్పారు. ఆ ఆవమాన భారంతో నీరజ్‌ను హత్య చేశామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు.

బాలుడితో రెక్కీ
నీరజ్‌ను
హత్య
చేయాలని
ప్లాన్
చేసుకున్న
నిందితులు..
జుమేరాత్
బజార్లో
కత్తులు,
రాడ్లు
కొన్నారు.
ముందుగా
ఒక
బాలుడితో
రెక్కీ
చేశారు.
ఆ
తర్వాత
రంగంలోకి
దిగారు.
బైక్‌పై
వెళుతున్న
నీరజ్
కంట్లో
కారం
చల్లి..
ఆపై
కత్తులతో
దాడి
చేసి
హత్య
చేశారు.
ఘటనకు
ముందు
నిందితులు
పీకల
దాకా
మద్యం
సేవించినట్లు
పోలీసులు
గుర్తించారు.
మే
20వ
తేదీ
రాత్రి
షాహినాథ్
గంజ్
పీఎస్
పరిధిలోని
మచ్చీ
మార్కెట్లో
హత్య
జరిగింది.
రెండు
బైక్‌లపై
వచ్చిన
దుండగులు..
అందరూ
చూస్తుండగా
నీరజ్‌పై
దాడి
చేశారు.
బండరాయితో
మోదారు.
తర్వాత
కత్తులతో
పొడిచి
చంపారు.
20
కత్తిపోట్లకు
గురైన
నీరజ్..
స్పాట్లో
చనిపోయాడు.

ప్రేమాయణం
నీరజ్,
సంజన
ప్రేమించుకున్నారు.
విషయం
తెలిసిన
కుటుంబ
సభ్యులు
సంజనను
బయటికి
వెళ్లకుండా
కట్టడి
చేశారు.
చాటుగా
నీరజ్‌తో
ప్రేమాయణం
సాగించింది.
గతేడాది
ఏప్రిల్‌లో
సంజనకు
మరో
అబ్బాయితో
పెళ్లి
నిశ్చయించారు.
పెళ్లికి
మూడు
నెలల
ముందు
ఇంటి
నుంచి
పారిపోయింది.
ఆర్య
సమాజ్‌లో
నీరజ్‌ను
రిజిస్టర్
మ్యారేజ్
చేసుకుంది.
ఏడాది
కుటుంబ
సభ్యులకు
దూరంగా
ఉన్న
సంజన..
బాబు
పుట్టాక
తల్లితో
మాట్లాడింది.
అప్పుడు
కూడా
బేగంబజార్‌కు
రావొద్దని
సంజనను
ఆమె
తల్లి
హెచ్చరించింది.
అయినా
తన
తల్లి
మాటను
లెక్కచేయకుండా
బేగంబజార్‌లో
నివసించింది.
మరింత
కోపం
పెంచుకున్న
ఆమె
కుటుంబ
సభ్యులు..
నీరజ్‌ను
చంపేశారు.
కోపంతో
మట్టుబెట్టారు.
దీంతో
సంజన
భర్త
లేని
ఒంటరిది
అయ్యింది.