హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిఫ్ట్ వైర్ తెగిపడి.. 200 అడుగుల ఎత్తు నుంచి కిందపడి..!

|
Google Oneindia TeluguNews

ఆదిలాబాద్ : ప్రాజెక్టు నిర్మాణంలో అపశృతి చోటుచేసుకుంది. జైనథ్ మండలం చనాక కొరాట బ్యారేజ్ పనుల్లో ఇద్దరు కూలీలు మృత్యువాత పడ్డారు.
ఇటీవల బ్యారేజ్ నిర్మాణం పనులు వేగవంతమైన తరుణంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికంగా విషాదం నెలకొంది. పెన్ గంగా నదిపై నిర్మిస్తున్న బ్యారేజ్‌ పనుల్లో భాగంగా ప్రమాదవశాత్తు లిఫ్ట్ వైర్ తెగిపడింది.

నిర్మాణం పనుల్లో భాగంగా బ్యారేజ్‌ గేట్లు బిగిస్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్‌ వైర్ తెగిపడింది. దాంతో ఇద్దరు కూలీలు మృత్యువాత పడగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అదలావుంటే బ్యారేజీకి సంబంధించి ఇంకా మూడు గేట్లు బిగించాల్సి ఉన్న తరుణంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడంతో తోటి కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

 lift wire cuts in barage works two labours died in adilabad

నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!నవగ్రహాల పూజపై ఉన్న శ్రద్ధ.. రైళ్లపై లేదుగా.. అధికారుల తీరుపై జనాగ్రహం..!

బుధవారం నాడు పదహారవ నెంబర్ గేటు బిగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా లిఫ్ట్ వైర్ తెగిపడటంతో దాదాపు రెండు వందల అడుగుల ఎత్తు నుంచి నలుగురు కూలీలు కిందపడ్డారు. అందులో ఇద్దరు స్పాట్‌లో చనిపోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు.

English summary
Two Labours Died In Adilabad korata barage construction works. All of sudden, lift wire cuts and four labours felt down. In that two were died.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X