మందుబాబులకు షాక్.. బీర్, క్వార్టర్‌పై రూ.20 పెంపు, అమల్లోకి..
మందుబాబులకుతెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి పెరిగిన మద్యం ధరలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. పెరిగిన ధరలను రేపు ఉదయం ప్రకటిస్తారు. బుధవారం మద్యం అమ్మకాల తర్వాత వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ సీజ్ చేస్తుంది. మిగిలిన మద్యాన్ని లెక్కించి, వాటిని కొత్త ధరలకు అమ్మేలా చూస్తారు. రేపటి నుంచి పెరిగిన ధరలకు మద్యం అమ్మాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.
ధరలు పెంచుతూ పాత స్టాక్‌పైన భారం వేయడంపై వైన్ షాపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పది శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. క్వార్టర్ మద్యం బాటిల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 వరకు పెరిగే అవకాశం ఉంది. బీర్ల ధరలను కూడా ప్రభుత్వం పెంచనుంది. బీర్లపై రూ.20 వరకు పెరిగింది. మద్యం ధరల పెంపుతో మందుబాబులు అల్లాడిపోతున్నారు.

లిక్కర్ ధర పెంపుతో మందుబాబుల నోటిలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది. ఈ ధరల వాత ఏమిటని అడుగుతున్నారు. అసలే వేసవి.. ఆపై ఉక్కపోతతో జనం బీర్లు సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 వరకు పెంచడం భావ్యం కాదని అంటున్నారు. అంతకుముందు కూడా రూ.160 ఉండేది. కానీ ప్రభుత్వం ధరలను సవరించింది. ఇప్పుడు ఏకంగా రూ.20 పెంచింది.