• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మంత్రి పదవి నిరీక్షణ ఫలించింది.. ఇక పోర్టుఫోలియోపై ఎదురుచూపు

|

హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఎన్నో ఊహాగానాలు, మరెన్నో అనుమానాలు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమినిస్టర్ గా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ రెండు నెలలు గడిచినా.. మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు. సరిగ్గా 71 రోజులకు కేబినెట్ విస్తరణ జరిగింది. ఆ మేరకు కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారి అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నా.. తమ నాయకుడికి ఏ శాఖ వస్తుందోననే టెన్షన్ లో ఉన్నారు.

Live Updates: telangana cabinet expansion ministers swearing in ceremony

Newest First Oldest First
2:09 PM, 19 Feb
ఎదురుచూసిన మంత్రి పదవి దక్కింది.. ఇక పోర్టుఫోలియోల కోసం నిరీక్షిస్తున్న కొత్త మంత్రులు
1:56 PM, 19 Feb
కొత్త మంత్రులను కలవడానికి వస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు. హైదరాబాద్ లోని మంత్రుల ఇళ్ల దగ్గర కోలాహలం.
1:40 PM, 19 Feb
జిల్లాల్లో సంబరాలు..తమ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో సంబరాలు చేసుకుంటున్న వారి అనుచరులు.
12:47 PM, 19 Feb
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు ఈవిధంగా ఉండనున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ - సంక్షేమ శాఖ, తలసాని - పౌరసరఫరాలు, ఎర్రబెల్లి దయాకర్ రావు - వ్యవసాయం, నిరంజన్ రెడ్డి - ఆర్థిక శాఖ, జగదీశ్ రెడ్డి - ఆర్ అండ్ బీ, కొప్పుల ఈశ్వర్ - విద్యాశాఖ, ప్రశాంత్ రెడ్డి - పరిశ్రమలు, శ్రీనివాస్ గౌడ్ - ఎక్సైజ్ శాఖ, మల్లారెడ్డి - విద్యుత్, ఇంద్రకరణ్ రెడ్డి - వైద్యశాఖ
12:43 PM, 19 Feb
కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడంతో వారికి ఏయే శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ మొదలైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త మంత్రులకు పోర్టుఫోలియో కేటాయింపు జరగనుంది.
12:25 PM, 19 Feb
మంత్రి పదవి రాలేదంటూ.. ఆయన వర్గంలో అసంతృప్తి అంటూ వచ్చిన వార్తలకు బ్రేక్ చెప్పిన హరీశ్ రావు
12:19 PM, 19 Feb
వివిధ సమీకరణాలు, సామాజిక వర్గాల నేపథ్యంలోనే మంత్రివర్గం కూర్పు జరిగింది. ఆ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు : హరీశ్ రావు
12:16 PM, 19 Feb
తనకు మంత్రి పదవి రాలేదంటూ.. అన్యాయమంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు హరీశ్ రావు.
12:15 PM, 19 Feb
సేనలకు, గ్రూపులకు నేను దూరం. నా పేరుపై అలాంటివి ఏమీ లేవు. వాటితో నాకు సంబంధం లేదు : హరీశ్ రావు
12:12 PM, 19 Feb
టీఆర్ఎస్ పార్టీలో నేను సైనికుడిని.. అధినేత ఆదేశాల మేరకు పనిచేస్తా : హరీశ్ రావు
12:10 PM, 19 Feb
మంత్రి పదవి రాలేదంటూ అసత్య ప్రచారాలు, దుష్ప్రచారాలు చేయొద్దని కోరిన హరీశ్ రావు.
12:08 PM, 19 Feb
తనకు మంత్రి పదవి రాలేదని సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు రాయొద్దని హితవు పలికిన హరీశ్ రావు.
12:07 PM, 19 Feb
క్రమశిక్షణ కలిగిన పార్టీగా కేసీఆర్ ఆదేశాలను పాటించడం మా బాధ్యత అంటున్న హరీశ్ రావు.
12:07 PM, 19 Feb
మంత్రి పదవి రానందుకు నాకు బాధగా లేదన్న హరీశ్ రావు.
12:06 PM, 19 Feb
గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తో గ్రూప్ ఫోటో దిగిన కొత్త మంత్రులు
11:56 AM, 19 Feb
ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ పర్వం.. ఇక పోర్టుఫోలియోలపై ఉత్కంఠ
11:55 AM, 19 Feb
ముగిసిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం
11:54 AM, 19 Feb
లక్కీ ఛాన్స్ : మల్లారెడ్డి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే.. వెంటనే మంత్రి పదవి
11:53 AM, 19 Feb
2014లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపు
11:53 AM, 19 Feb
విద్యాసంస్థల అధినేతగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడు మల్లారెడ్డి.
11:52 AM, 19 Feb
పదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చామకూర మల్లారెడ్డి.. మేడ్చల్ నుంచి ప్రాతినిధ్యం
11:52 AM, 19 Feb
బాల్కొండ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రశాంత్ రెడ్డి
11:51 AM, 19 Feb
గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రశాంత్ రెడ్డి
11:51 AM, 19 Feb
బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం
11:50 AM, 19 Feb
తొమ్మిదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి
11:50 AM, 19 Feb
2014లో కేసీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్ గౌడ్.
11:49 AM, 19 Feb
ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ గౌడ్
11:49 AM, 19 Feb
ఎనిమిదో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీనివాస్ గౌడ్
11:48 AM, 19 Feb
సుదీర్ఘ రాజకీయ నేత అయినప్పటికీ తొలిసారిగా ఎర్రబెల్లికి మంత్రిగా అవకాశం
11:48 AM, 19 Feb
1982లో ప్రారంభమైన రాజకీయ ప్రస్థానం. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నెరవేరిన ఎర్రబెల్లి మంత్రి కల.
READ MORE

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Telangana Cabinet is finally decided. 10 colleagues have been selected by the CM KCR. Four of the old cabinet colleagues, along with four others, were given chance. Eatala Rajendar, Jagdish Reddy, Talasani Srinivas Yadav, Allola Indrakaran Reddy, also served as ministers in the Cabinet. Errabelli Dayakar Rao, Chamakura Malla Reddy, Vemula Prashant Reddy, Srinivas Goud, Koppula Eshwar, Singireddi Niranjan Reddy are new ministers. They will be sworn in Raj Bhavan at 11.30 am in the morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more