హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Telanganaలో లాక్ డౌన్ ఎత్తివేత.. థియేటర్లు ఓపెన్, క్యాబినెట్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ఎత్తివేయాలని మంత్రివర్గం డిసిషన్ తీసుకుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ జరిగగింది. వైరస్ తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని సమావేశంలో చర్చ జరిగింది. ఇవాళ్టి వరకు సాయంత్రం 5 గంటల వరకు లాక్ డౌన్.. గంట సమయం వెసులుబాటు అంటే 6 గంటల వరకు లాక్ డౌన్ ఉండనుంది. రేపటినుంచి అన్నీ ఫ్రీ ఉండనున్నాయి. అలాగే నైట్ కర్ఫ్యూ కూడా ఉండనుంది. కర్ఫ్యూ కూడా ఇవాళ రాత్రితో ముగియనుంది.

రిపోర్ట్ తీసుకొని.. మంత్రులకు చెప్పి..

రిపోర్ట్ తీసుకొని.. మంత్రులకు చెప్పి..

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీసుశాఖ, వైద్యార్యోగ శాఖ నుంచి సీఎం కేసీఆర్ నివేదిక తెప్పించుకున్నారు. మంత్రుల అభిప్రాయం తీసుకుని.. లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో మునుపటి మాదిరిగా అన్నీ కార్యకలాపాలు జరగనున్నాయి. రాష్ట్రంలో మే 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించారు. తొలుత ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకే బయటకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. అత్యవసరం ఉన్నవారు పాసు తీసుకోవాలని కోరారు.

పొడగింపు..

పొడగింపు..

తర్వాత దానిని మధ్యాహ్నం 1 గంట వరకు పొడగించారు. 2 గంటల వరకు ఇంటికి చేరుకోవాలని కోరారు. తర్వాత సాయంత్రం 5 గంటల వరకు కంటిన్యూ చేశారు. సాయంత్రం 6 లోపు ఇంటికి చేరుకోవాలని స్పష్టంచేశారు. ఇప్పుడు కేసులు తగ్గినందున.. అన్నీ కార్యకలాపాలకు పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఆంక్షలు లేకుండా ప్రతీ ఒక్కరు బయటకు వెళ్లొచ్చు.. కానీ మాస్క్ ధరించి.. ఫిజికల్ డిస్టన్స్ మాత్రం పాటించాలని స్పష్టం చేశారు.

థియేటర్లు ఓపెన్

థియేటర్లు ఓపెన్


ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసివేసి ఉంటున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది. కరోనా వల్ల.. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
lockdown lift in the telangana state tomorrow onwards and night curfew also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X