హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యాక్సిన్ ఓకే.. సరఫరా సంగతేంటీ..? ప్రపంచ నలుమూలాల వరకు పంపించడం, ఎలా..?

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కూడా వ్యాక్సిన్ ప్రయోగం జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ ప్రయోగం పూర్తయితే ప్రపంచం నలుమూలాల పంపించడం పెద్ద సవాల్‌గా మారింది. ఇక్కడినుంచి మిలియన్ డోసులు పంపించి.. ప్రజల ప్రాణాలను కాపాడొచ్చు.. కానీ వ్యాక్సిన్ సురక్షితంగా పంపించడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

 కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగా కరోనా బీభత్సం: అరకోటికి చేరువగా కేసులు: 80 వేలను దాటిన మరణాలు: మరింత దూకుడుగా

కొంచెం డిఫరెంట్.. ఎందుకంటే..

కొంచెం డిఫరెంట్.. ఎందుకంటే..

కోవిడ్-19 వ్యాక్సిన్ మిగతా వాటి మాదిరిగా సరఫరా చేయడం వీలు కాదు. తక్కువ ఉష్ణోగ్రతలో.. నిరంతరం స్థిరికరీస్తూ సప్లై చేయాలి. 2 నుంచి 8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో మాత్రమే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని కేపీఎంజీ ఇండియా ట్రాన్స్ పోర్ట్ పార్ట్ నర్ సమీర్ భట్నాగర్ తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ మార్గాలు తక్కువగా ఉన్న సమయంలో తక్షణ అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. భారీ నిల్వ సామర్థ్యంతో సౌకర్యాలు అవసరం అవుతోందని చెప్పారు. ప్రపంచంలోని నలుమూలాల వరకు డెలివరీ చేసేందుకే సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు ఇతర పరిష్కారాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తక్కువ ఉష్ణోగ్రతలో సరఫరా..

తక్కువ ఉష్ణోగ్రతలో సరఫరా..

కోవిడ్-19 వ్యాక్సిన్ సరఫరాలో ఎయిర్ కార్గో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల జీఎంఆర్ ఫార్మా ఉత్పత్తుల కోసం కూల్ డాలీస్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఉష్ణోగ్రతను సమంగా ఉంచడం వీలవుతుందని.. కోవిడ్-19 వ్యాక్సిన్‌కు మేలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాలకు తొలుత ఉష్ణోగ్రతను నియంత్రించి పంపిస్తామని జీహెచ్ఏసీ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే విమానాల ద్వారా టీకాలను సప్లై చేయడం ద్వారా ఎయిర్ కార్గో ఇండస్ట్రీ ఇబ్బందులను ఎదుర్కొంటుందని మరికొందరు వాదిస్తున్నారు.

టీకాలే సరఫరా చేయొద్దు.. అభివృద్ది చెందుతోన్న దేశాలు...

టీకాలే సరఫరా చేయొద్దు.. అభివృద్ది చెందుతోన్న దేశాలు...

టీకాలను సరఫరా చేస్తే విమానరంగంపై ప్రభావం చూపుతోందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ అన్నారు. ముఖ్యంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో పరిమిత వాయు కార్గొ సామర్థ్యం ద్వారా పంపిస్తే బాగుంటుందని సూచించారు. అయితే కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం వ్యాక్సిన్, ఇతర వస్తువుల సరఫరా చేస్తున్నాయి.

757 బోయింగ్ విమానాలు

757 బోయింగ్ విమానాలు

బ్లూ డార్ట్ వంటి కొరియర్ సంస్థలు.. ప్రపంచంలోని చాలా ప్రాంతాలకు వ్యాక్సిన్ చేర్చేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. వ్యాక్సిన్ టెంపరేచర్‌కు అనుకూలంగా ఎలా మార్పులు చేయాలని భావిస్తోంది. బ్లూ డార్ట్‌కి చెందిన 757 బోయింగ్ సరుకు రవాణా విమానాలు హైదరాబాద్ చేరుకున్నాయి. వ్యాక్సిన్ కోసం ఆర్డర్ వస్తే.. అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడినుంచి ఆర్డర్ వచ్చినా పంపిస్తామని చెబుతున్నారు.

English summary
coronavirus vaccine is out and Hyderabad starts churning out millions of these life-saving doses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X