హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వన్ ఇండియా ముందే చెప్పింది..! ఔరంగబాద్ నుంచి ఎంఐఎం పోటీ

|
Google Oneindia TeluguNews

ముంబై : లోక్‌సభ బరిలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఎంఐఎం పార్టీ ఇప్పుడు దేశం వైపు చూస్తోంది. ఇన్నాళ్లు ఏపీ, తెలంగాణలోనే పోటీచేసిన ఆ పార్టీ.. క్రమక్రమంగా దేశమంతటా విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఆ క్రమంలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలను దాటి తొలిసారిగా ఇతర రాష్ట్రంలో పోటీ చేస్తోంది. పార్లమెంటరీ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి ఎంఐఎం పోటీ చేయబోతుందనే వార్తను వన్ ఇండియా తెలుగు పబ్లిష్ చేసింది.

2 కోట్ల 96 లక్షలకు పైగా తెలంగాణ ఓటర్లు.. జిల్లాల వారీగా లెక్కలివే..!2 కోట్ల 96 లక్షలకు పైగా తెలంగాణ ఓటర్లు.. జిల్లాల వారీగా లెక్కలివే..!

 మొదటిసారి..!

మొదటిసారి..!

ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారని ప్రకటించారు అధినేత అసదుద్దీన్.
ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంతియాజ్ జలీల్ సయ్యద్.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్ ట్వీట్ చేశారు.

 లోక్‌సభ బరి.. ఎంఐఎం గురి

లోక్‌సభ బరి.. ఎంఐఎం గురి

మహారాష్ట్రలో రెండు స్థానాల నుంచి ఎంఐఎం పోటీ చేయనుందనే వార్త వన్ ఇండియా తెలుగు పబ్లిష్ చేసింది. ఎంఐఎం తాజా నిర్ణయంతో మేము రాసిన వార్తా కథనం నిజమైంది. ముంబై నార్త్ సెంట్రల్ లేదా ముంబై నార్త్ వెస్ట్ స్థానం నుంచి కూడా తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించేందుకు పోటీ చేసేలా ప్లాన్ చేశారు అసదుద్దీన్. అయితే చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. మొత్తానికి ఔరంగాబాద్ నుంచి తమ పార్టీ అభ్యర్థిని లోక్‌సభ బరిలోకి దించుతోంది.

ఎంపీగా ఎమ్మెల్యే..!

ఎంపీగా ఎమ్మెల్యే..!

ఔరంగాబాద్ సెంట్రల్ అసెంబ్లీ నుంచి ఎంఐఎం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంతియాజ్ జలీల్ సయ్యద్.. 2014లో తొలిసారి పోటీ చేసి గెలుపొందారు. శివసేన అభ్యర్థి ప్రదీప్ జైస్వాల్ పై దాదాపు 20 వేల మెజార్టీ సాధించారు. సయ్యద్ కు 61 వేల 843 ఓట్లు రాగా.. ప్రదీప్ జైస్వాల్ కు 41 వేల 861 ఓట్లు పోలయ్యాయి.

English summary
The Asaduddin Owaisi-led AIMIM Tuesday announced its Maharashtra MLA Imtiaz Jaleel as the party candidate from Aurangabad Lok Sabha constituency in the western state. This is the first time outside Telangana and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X