హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రవి ప్రకాష్, శివాజీలపై లుక్ అవుట్ నోటీసులు జారీ .. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టుల్లో అలెర్ట్

|
Google Oneindia TeluguNews

Recommended Video

రవి ప్రకాష్,శివాజీలపై లుక్ అవుట్ నోటీసులు జారీ || Oneindia Telugu

టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్‌‌, శివాజీలపై తెలంగాణా పోలీసుల ఉచ్చు బిగుస్తోంది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రవి ప్రకాష్, శివాజీలపై లుక్ ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. నిన్న అర్దరాత్రి సైబరాబాద్ పోలీసులు వారిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.

 ఫోర్జరీ పెకాశం ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి .. మిమ్మల్నేమి అనరు - విజయసాయి సైరా పంచ్ ఫోర్జరీ పెకాశం ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి .. మిమ్మల్నేమి అనరు - విజయసాయి సైరా పంచ్

రవి ప్రకాష్‌‌, శివాజీలపై లుక్ అవుట్ నోటీసులు జారీ

రవి ప్రకాష్‌‌, శివాజీలపై లుక్ అవుట్ నోటీసులు జారీ

ఫోర్జరీ, నిధుల మళ్లింపు, ట్రేడ్ మార్క్ పై తప్పుడు అగ్రిమెంట్లపై కేసులతో పాటు తాజాగా లోగోల అమ్మకం, టీవీ9 యాడ్స్ ను సొంత మొబైల్ టీవీకి మళ్ళించటం వంటి అభియోగాలపై ఇప్పటికే పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు అయ్యాయి. . ఐపీసీ 457, 420, 409, 406, 20(బి) సెక్షన్ల కింద రవిప్రకాష్ పై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. కానీ వారు హాజరు కాలేదు. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినా అక్కడ చుక్కెదురైంది. వారి పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది. ఇక తప్పించుకు తిరుగుతున్న వారికి మరో మారు నోటీసులు జారీ అయినా కూడా విచారణకు హాజరుకాలేదు రవిప్రకాష్, శివాజీలు . ఈ క్రమంలోనే విదేశాలకు పారిపోకుండా లుక్ ఔట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు.

దేశం విడిచి పారిపోయే ఛాన్స్ ఉందని అనుమానం .. అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ అలెర్ట్ .. ఏపీలో ఉన్నట్టు సమాచారం

దేశం విడిచి పారిపోయే ఛాన్స్ ఉందని అనుమానం .. అన్ని ఎయిర్ పోర్టుల్లోనూ అలెర్ట్ .. ఏపీలో ఉన్నట్టు సమాచారం

రవిప్రకాష్, శివాజీ దేశం విడిచిపారిపోయే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటికే వీరి పాస్ పోర్ట్స్ పై పాస్ పోర్ట్ అధికారులతో మాట్లాడారు. అంతేకాదు దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశారు. ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపడుతున్నారు. వీరు ఎయిర్ పోర్టుల్లోకి ప్రవేశిస్తే వెంటనే అరెస్టు చేయాలని కూడా ఆదేశించారు పోలీసులు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు విజయవాడ పరిసర ప్రాంతాల్లో టీవీ9 రవి ప్రకాష్ , శివాజీ లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ముమ్మర గాలింపు కూడా చేపట్టారు.

రవి ప్రకాష్ , శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా

రవి ప్రకాష్ , శివాజీ అజ్ఞాతం వీడుతారా ? లేదా

టీవీ9లో వీరు చేసిన అక్రమాలపై ఫిర్యాదులు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. 2018 ఫిబ్రవరిలో శివాజీ, రవి ప్రకాష్‌, శక్తి, మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిషణ్ మధ్య ఈ-మెయిల్స్ ద్వారా జరిగిన కుట్రను కూడా సైబర్ క్రైం పోలీసులు బయటపట్టారు. తప్పుడు అగ్రిమెంట్లు, ఫోర్జరీ సంతకాలతో తప్పుదోవ పట్టించటం, నిధులు మళ్లింపు, టీవీ9 లోగోను విక్రయించాలనే దురాలోచన... ఇలాంటి అక్రమాలపై ఇప్పటికే సైబర్ క్రైం, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి . టీవీ 9 లోగోను సైతం రూ. 99వేలకు విక్రయించటానికి తప్పుడు అగ్రిమెంట్ కూడా చేసినట్లు పోలీసులు గుర్తించారు. లుక్ ఔట్ నోటీసులు జారీ చేయడంతో ఇప్పటికైనా రవి ప్రకాష్, శివాజీ పోలీసుల ముందు హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అదే గనుక జరగకపోతే వారిని తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేస్తారా ? తెలంగాణా పోలీసులకు వారు చిక్కుతారా ? అన్నది కూడా ఉత్కంఠ రేపే అంశమే.

English summary
The Cyberabad police have issued a lookout notice against former TV9 Chief Executive Officer V. Ravi Prakash and actor S. Shivaji in connection with a forgery case that was booked against them a few days ago.Both Ravi Prakash and Shivaji failed to appear before the Cybercrimes police even after issuing three notices to them. This has prompted the police to issue a lookout notice against them.A few days ago, the Banjara Hills police also booked a case against Ravi Prakash and others for indulging in cheating and criminal breach of trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X