హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఓటింగ్ తగ్గుదల కేసీఆర్ కుట్ర -ఈసీ కూడా దోషే -విజయశాంతి తాజా సంచలనం

|
Google Oneindia TeluguNews

కొండంత రాగం తీసి.. పితుకంత పాట పాడినట్లుగా.. సాధారణ ఎన్నికలను తలపించే స్థాయిలో ప్రచారం సాగినా.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో.. పోలింగ్ శాతం మాత్రం అత్యల్పంగా నమోదైంది. 2016 ఎన్నికల్లో 45.29 శాతం ఓటింగ్ నమోదుకాగా, ఈసారి 40 శాతం కూడా దటకపోవడం గమనార్హం. వరుస సెలవులు, కరోనా భయాల వల్లే తక్కువ టర్నౌట్ నమోదైందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ దీని వెనుక కుట్ర దాగుందని కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు.

నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?నిర్బంధ ఓటింగే శరణ్యమా?: గ్రేటర్‌లో ఓ చోట పోలింగ్ మరీ 0.74శాతమా? -కరెంట్, ఇంటర్నెట్ ఆఫ్ చేయాల్నా?

తగ్గుదలకు కేసీఆర్ కుట్ర..

తగ్గుదలకు కేసీఆర్ కుట్ర..

జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆర్ఎ‌స్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, ప్రముఖ నటి విజయశాంతి ఆరోపించారు. టీఆర్ఎస్ సర్కారుతోపాటు ఎన్నికల అధికారుల వైఫల్యం కారణంగానే పోలింగ్ శాతం భారీగా తగ్గిందన్నారు. సీఎం కేసీఆర్, ఎన్నికల సంఘం తీరును ఆమె తప్పు పట్టారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం వరుస కామెంట్లు చేశారు. విజయశాంతి ఏమన్నారో ఆమె మాటల్లోనే..

 తెలిసే తేదీలు ఫిక్స్ చేశారు..

తెలిసే తేదీలు ఫిక్స్ చేశారు..

‘‘జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కావడం ఆవేదన కలిగిస్తున్నప్పటికీ... ఇందులో ప్రభుత్వం, ఎన్నికల సంఘం బాధ్యత ఎక్కువనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. వరుస సెలవులు ఉన్నాయని తెలిసీ, ఎక్కువ మంది నగరంలో ఉండే అవకాశం లేదని తెలిసీ... ఈ సమయంలో ఎన్నికలు వచ్చేలా షెడ్యూల్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వమే వ్యూహాత్మకంగా పోలింగ్‌ను నిర్వీర్యం చేసిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు..

 ఓట్లు తొలగించారు..

ఓట్లు తొలగించారు..

ఓటరు నమోదు, ఓటరు జాబితాల్లో తగిన మార్పు చేర్పులు, అవకతవకలుంటే పరిశీలించి సరిచేయడానికి కావలసిన సమయం ఇవ్వకుండానే హడావుడిగా కేవలం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళడం కూడా ఈ పరిస్థితికి దారి తీసిందనే విమర్శను కొట్టిపారేయలేం. ముఖ్యంగా చాలా డివిజన్లలో ఉద్దేశ్యపూర్వకంగానే ఎందరో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అలాగే..

 ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు..

ప్రజల్ని కన్ఫ్యూజ్ చేశారు..


మంగళవారం నాటి ఎన్నికల్లో చాలా చోట్ల స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ అనేకమంది ఓటర్లు నిరాశతో వెనుదిరగడం చూస్తే పై ఆరోపణలు నిజమని నమ్మక తప్పడం లేదు. ఈ పరిస్థితి ఓటర్లను నిరాశకు గురిచేసి పోలింగ్ బూత్‌లకు రాకుండా చేసింది. ఇది గాక, చాలా పోలింగ్ బూత్‌‌లలో కోవిడ్ సన్నద్ధత కనిపించలేదనే వార్తలు కూడా వినిపించాయి. ఇది కూడా ఓటర్లను భయపెట్టింది. మొత్తం మీద జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణలో టీఆరెస్ సర్కారు కుట్ర పూరితంగా వ్యవహరించిందని అందరికీ స్పష్టమైంది'' అని విజయశాంతి చెప్పుకొచ్చారు.

గ్రేటర్ షాకింగ్ :ఈ నగరానికి ఏమైంది? -పోలింగ్ శాతం ఢమాల్ -కారణాలివే -ఖర్చుమాత్రం పెరిగిందిగ్రేటర్ షాకింగ్ :ఈ నగరానికి ఏమైంది? -పోలింగ్ శాతం ఢమాల్ -కారణాలివే -ఖర్చుమాత్రం పెరిగింది

English summary
despite high voltage campaign, Greater Hyderabad Municipal Corporation (GHMC) election was followed by a low turnout polling on Tuesday. congress leader Vijayashanthi alleges that cm kcr wantedly let the turnout down with the help of state election commission.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X