హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు ఊరట - కరోనా వల్ల అసెంబ్లీ నిరవధిక వాయిదా - 12 బిల్లులు పాస్

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు దారులకు ఊరట లభించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తగ్గిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజలపై భారం వేయమని, రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో ఉన్న ధర మేరకే ఫీజులు తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు. కాగా, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 28 వరకు జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. కరోనా మహమ్మారి కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఉభయ సభలు నిరవరధికంగా వాయిదా పడ్డాయి.

ఈ చిన్నారి నేరస్తుడా? - స్త్రీ,పురుషులు ఒకే గదిలోనా? - శారదా పీఠానికి టీటీడీ నిధులా?: చంద్రబాబు ఫైర్ఈ చిన్నారి నేరస్తుడా? - స్త్రీ,పురుషులు ఒకే గదిలోనా? - శారదా పీఠానికి టీటీడీ నిధులా?: చంద్రబాబు ఫైర్

ఎప్పుడో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయిన ఇళ్లు, స్థలాలకు ప్రస్తుత మార్కెట్‌ విలువ ఆధారంగా క్రమబద్ధీకరణ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై ప్రజల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. వర్షాకాల సమావేశాల చివరి రోజైన బుధవారం మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ ద‌రఖాస్తుదారుల‌కు ఊరట కలిగించే అంశాలు వెల్లడించారు. ఎమ్మెల్యేల విజ్ఞ‌ప్తి మేర‌కు 131 జీవోను స‌వ‌రించి.. గురువారం కొత్త జీవోను విడుదల చేస్తామన్నారు. దాని ప్రకారం పేద, మధ్య తరగతి ప్రజలపై భారం ఉండబోదని, వారు గతంలో రిజిస్ట్రేషన్‌ చేసిన సమయంలో ఉన్న ధర మేరకే ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు.

lrs process will be eased, says minister ktr, Telangana assembly adjourned sine-die

అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌రైన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు, పోలీసు, శాస‌న‌స‌భ సిబ్బందిలో 13మందికి క‌రోనా సోకినట్లు నిర్ధారణ కావడంతో బీఏసీ సమావేశం నిర్వహించిన అనంతరం ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు బుధవారం ప్రకటనలు చేశారు. కరోనా వ్యాప్తి అధికమవుతున్న నేపథ్యంలో బీఏసీ సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ పేర్కొన్నారు. సభ సజావుగా సాగేందుకు సహకరించిన సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - ఎలా దెబ్బకొడతారంటే..చైనాతో పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధం - ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన - ఎలా దెబ్బకొడతారంటే..

చారిత్రాత్మక నూతన రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్వో రద్దు బిల్లు, విప్లవాత్మక మార్పులతో కూడిన తెలంగాణ బీ పాస్ చట్టం బిల్లు సహా ఈ సమావేశాల్లో మొత్తం 12 బిల్లులు ఆమోదం పొందాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఈనెల 28 వరకు నిర్వహించాలనుకున్నా.. కరోనా కారణంగా వాయిదాపడ్డాయి.

English summary
The Monsoon session of the Telangana State Legislature has been adjourned sine-die abruptly amidst COVID pandemic concerns. As per the Business Advisory Committee meeting held on 7th of this month, the session of the legislature was to continue till 28th of this month. However, the session has been cut short with reporting of a considerable number of COVID cases from Members and Staff. Both, the Council and the Assembly passed about a dozen Bills and took up discussions on a couple of important issues of public importance including COVID, energy sector and infrastructure facilities in GHMC area among others during the session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X