హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రగ్రహణ ప్రభావం ... తిరుమల శ్రీవారి ఆలయంతో సహా తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆలయాల మూసివేత

|
Google Oneindia TeluguNews

నేడే చంద్ర గ్రహణం ... నేటి అర్ధ రాత్రి 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్ర గ్రహణం ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలను మూసివెయ్యనున్నారు. నేటి సాయంత్రం ఏడు గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. అంతే కాది ఇంద్రకీలాద్రి పై కొలువుతీరిన కనక దుర్గా ఆలయం, వరంగల్ లోని భద్రకాళీ ఆలయం , శ్రీశైలం మల్లన్న ఆలయం , యాదాద్రి నరసింహ స్వామీ వారి ఆలయం, భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి ఇలా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలలోని ఆలయాలన్నీ నేటి సాయంత్రం నుండి మూతపడనున్నాయి. తిరిగి రేపు ఉదయం ఆలయాలను తెరుస్తారు .

అర్దరాత్రి దాటాక సంపూర్ణ చంద్రగ్రహణం .. గ్రహణానికి ఆరుగంటల ముందే ఆలయాల మూసివేత

అర్దరాత్రి దాటాక సంపూర్ణ చంద్రగ్రహణం .. గ్రహణానికి ఆరుగంటల ముందే ఆలయాల మూసివేత

నేటి అర్ధరాత్రి దాటాక 1:31 నుంచి 4:29 గంటల వరకు చంద్రగ్రహణ ఘడియలు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు పండితులు, ఆలయ అర్చకులు . గ్రహణ వేదన మధ్యాహ్నం మూడు గంటల నుంచే ఉండడంతో సాయంత్రం పూజా కార్యక్రమా లను నిలిపివేయనున్నారు. ఉదయం ఆలయాల్లో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని మధ్యాహ్నం పన్నెండు గంటల నుండీ ఆలయాల మూసివేత ప్రారంభం చేస్తారు. తిరిగి మరుసటి రోజు ఉదయం తెరువనున్నారు. బుధవారం ఉదయం పుణ్యాహవచనం, ఆలయ సంప్రోక్షణ, దేవతలకు అభిషేకా లు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించనున్నారు. చంద్రగ్రహణం కారణంగా భక్తులు మధ్యాహ్నం మూడు గం టలలోపు ఆహారాన్ని స్వీకరించాలని పండితులు పేర్కొంటున్నారు.

తెలంగాణలో యాదాద్రి నరసింహ స్వామి, బాసర సరస్వతీ, భద్రకాళి అమ్మవార్ల ఆలయాలు మూసివేత

తెలంగాణలో యాదాద్రి నరసింహ స్వామి, బాసర సరస్వతీ, భద్రకాళి అమ్మవార్ల ఆలయాలు మూసివేత

సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంగళవారం సాయంత్రం 6:30 నుంచి మూసివేయనున్నట్టు ఈవో గీత తెలిపారు. తిరిగి 17వ తేదీ ఉదయం 5:30 గంటలకు ఆలయాన్ని తెరిచి సంప్రోక్షణతో నిత్య విధులు నిర్వహిస్తామని చెప్తున్నారు. చంద్ర గ్రహణం సందర్భంగా 17వ తేదీ ఉదయం నిర్వహించే ఆర్జిత సేవలు నిలిపివేసి, 9 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు. చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయ సందర్శన వేళల్లో చోటుచేసుకున్న మార్పులను భక్తులు గమనించి సహకరించాలని కోరారు. కాగా, తెలంగాణలోని మరో ముఖ్యమైన బాసర ఆలయాన్ని సైతం చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. శాకంభరీ వేడుకలను జరుపుకుంటున్న భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని కూడా సాయంత్రం నుండి రేపు తెల్లవారు జాము వరకు మూసివేయనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళీ శేషు తెలిపారు.

తిరుమల శ్రీవారి ఆలయ మూసివేత .. రేపు ఉదయం తిరిగి తెరుచుకోనున్న ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయ మూసివేత .. రేపు ఉదయం తిరిగి తెరుచుకోనున్న ఆలయం

చంద్రగ్రహణం కారణంగా జులై 16న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని మూసి వేయనున్నారు. జూలై 16వ తేదీ రాత్రి 7:00 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారు జామున గం.5:00 వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ తలుపులు మూసివేస్తారు. జులై 17వ తేదీ (16 అర్ధరాత్రి) గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.జులై 17వ తేదీన ఉదయం 5:00 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవాచనం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అయితే ఆ రోజు ఉదయం 11:00 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఆలయం మూసివేత కారణంగా జులై 16, 17 తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ అధికారులు రద్దు చేశారు.

శ్రీశైలం మల్లన్న , బెజవాడ దుర్గంమల ఆలయాలను మూసివేయనున్న అర్చకులు

శ్రీశైలం మల్లన్న , బెజవాడ దుర్గంమల ఆలయాలను మూసివేయనున్న అర్చకులు

ఇక శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి వార్ల ఆలయాలను చంద్ర గ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం కాలపూజ చేసి మూసివేస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. గ్రహణ కాలం ముగిసిన తరువాత బుధవారం తెల్లవారుజామున ఆలయ ద్వారాలు తెరచి ఆలయశుధ్ది, సంప్రోక్షణలు చేసి స్వామి అమ్మవార్లకు ప్రాత:కాల పూజలు నిర్వహిస్తారని తెలిపారు.మంగళవారం సాయంత్రం వరకు శాకాంభరి ఉత్సవంలో భాగంగా భక్తులకు స్వామి వారి దర్శన అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. బెజవాడ దుర్గమ్మ శాఖంబరి వేడుకలను జరుపుకుంటున్న సమయంలో చంద్ర గ్రహణం ఎఫెక్ట్ తో అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు అర్చకులు. రేపు ఉదయం సంప్రోక్షణ అంతరం భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.

చంద్ర గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉందంటే ..

చంద్ర గ్రహణ ప్రభావం ఏ రాశుల వారికి ఎలా ఉందంటే ..

ఇక నేడు ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం మేష, కర్కాటక, సిం హ, వృశ్చిక, మీన రాశుల వారికి చంద్రగ్రహ ణం శుభ ఫలితాలను అందిస్తుంది అని , తుల, కుంభ రాశుల వా రికి మధ్యమ, వృషభ, మిథున, కన్య, ధనస్సు, మకర రాశుల వారికి అంతగా శుభ ఫలితాల ను అందివ్వదని పండితులు చెబుతున్నారు. శుభఫలితాలను అందివ్వనివారు చంద్రజపం చేస్తే పనులు అనుకూలిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

English summary
Temples will be shut down in Telugu states today as there will be a lunar eclipse from 1:31 pm to 4:29 pm. Thirumala Srivari Temple will be closed from 7 pm today till 5 pm on Wednesday. Kanak Durga Temple on the Indrakeeladri Temple, Bhadrakali Temple in Warangal and Srisailam Mallanna Temple, The temple of Yadadri Narasimha Swamy and the famous shrines of Sri Sitarama Chandraswamy in Bhadrachalam will be closed from this evening. The temples will open again tomorrow morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X