హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

11 మంది న్యాయమూర్తులతో కోర్టు, లైంగికదాడుల కేసుల విచారణ స్పీడప్, హైకోర్టు

|
Google Oneindia TeluguNews

వెటర్నరీ వైద్యురాలు దిశ దాడి తర్వాత హైకోర్టు చర్యలకు ఉపక్రమించింది. సాధారణంగా నేర తీవ్రతను బట్టి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేస్తారు. కానీ ఘటన తీవ్రత దృష్ట్యా కేసులను విచారించేందుకు 11 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని హైకోర్టు తెలిపింది. దీంతో ఆ నేరాలపై విచారణ త్వరగా జరిగి, నిందితులకు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.

దిశ లాంటి ఘటనలపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు, సమాజంలో మార్పు రావాలట...దిశ లాంటి ఘటనలపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు, సమాజంలో మార్పు రావాలట...

ప్రత్యేక కోర్టు

ప్రత్యేక కోర్టు

11 మంది న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు తెలిపింది. రాష్ట్రంలో ఇకపై జరిగే లైంగిక దాడుల కేసులను ప్రత్యేక కోర్టు విచారిస్తోంది. కేసు ఎఫ్ఐఆర్ దాఖలు చేశాక, పోలీసులు చార్జీషీట్ దాఖలు చేస్తే చాలు.. వాదోపవాదనలు పూర్తిచేసి త్వరితగతిన శిక్ష ఖరారు చేస్తారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం తప్పుతుంది. దీంతోపాటు బాధితులకు త్వరగా న్యాయం జరిగే అవకాశాలు పుషల్కంగా ఉంటాయి.

దారుణం..

దారుణం..

గత నెల 27వ తేదీన దిశపై మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు లైంగికదాడి చేసి, హతమార్చిన సంగతి తెలిసిందే. తర్వాత నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని... చర్లపల్లి జైలుకు రిమాండ్ ఖైదీలుగా తరలించారు. నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారిస్తుండగా.. ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి సమీపంలో నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు కాల్పులు జరిపారు. నలుగురు నిందితులు చనిపోయినా సంగతి తెలిసిందే.

మరో 9 మంది కూడా

మరో 9 మంది కూడా


మరోవైపు మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు మరో 9 మంది అమ్మాయిలను దిశ మాదిరిగా హతమార్చారనే సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటకలో మిస్సింగ్ కేసు నమోదైన వారి వివరాలు.. ఆస్తికలకు నిందితుల డీఎన్ఏ సరిపోలిందని పోలీసులు చెప్తున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాల్సి వచ్చిన సమయంలోనే వారికి మిగతా నేరాలతో కూడా సంబంధం ఉందనే సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ పేర్కొన్నారు. ఆయన ఊహించినట్టుగానే ఆధారాలు కూడా బయటపడుతున్నాయి.

English summary
11 magistrates along court Establish in telangana state high court said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X