హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫుడ్ ఆర్డర్‌కు తప్పని వివక్ష.. హిందుయేతరుడు తీసుకొచ్చాడని కస్టమర్ నో.. పోలీసులకు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

కుల, మత, వర్ణ వివక్ష రక్కసి జాఢలు పైత్యం ఎక్కువవుతోంది. పల్లెల్లోనే కాదు నగరాల్లో కూడా పెచ్చుమీరుతోంది. తాజాగా విశ్వనగరి భాగ్యనగరంలో జరిగిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చింది ముస్లిం అని తీసుకోక కస్టమర్ తన పైత్యాన్ని చూపించాడు. ఆహారాన్ని స్వీకరించకుండా తీసుకొచ్చిన వ్యక్తిని అవమానించాడు.

భోజనప్రియులు ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వర్ణ వివక్ష చూపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం హైదరాబాద్‌లో అజయ్ కుమార్ అనే కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే తన ఆహారాన్ని హిందువులు అందించాలని సూచించారు. రిక్వెస్ట్ కూడా పెట్టాడు. కానీ ఆ సమయంలో లేకపోవడంతో.. ముస్లింను పంపించడం తప్ప మరో మార్గం లేకపోయింది.

Man booked for not accepting food from Muslim delivery agent

అజయ్ సూచించిన సమయానికి హిందు డెలివరీ బాయ్‌లు ఎవరూ లేకుండాపోయారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ముదస్సిర్‌ను పంపించాల్సి వచ్చింది. ఆయన కస్టమర్ కోసం ఆహారం తీసుకొనే.. అజయ్ మాత్రం పైత్యం చూపించాడు. తనకు ఫుడ్ వద్దన తల పొగరు బయటపెట్టారు. దీంతో చేసేది ఏమీ లేక ముదస్సిర్ తిరిగి ఆన్‌లైన్ ఆర్డర్ వద్దకు ఫుడ్ తీసుకొచ్చారు.

తమకు జరిగిన అన్యాయంపై ముదస్సిర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అజయ్ మత వివక్ష చూపించాడని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదుచేశామని.. దీనికి సంబంధించి విచారణ జరుగుతుందని పోలీసులు తెలిపారు.

English summary
delivery agent Friday registered a complaint against a client, who refused to accept his order as the agent was Muslim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X