హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమ్మాయి వేషం... సాఫ్ట్ వేర్ బ్రహ్మీలే టార్గెట్... హైదరాబాద్ లో నయా మోసం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : అమ్మాయినని నమ్మిస్తాడు. మాటలతో మాయ చేస్తాడు. నమ్మిన వారిని నిలువుదోపిడీ చేసి ఉడాయిస్తాడు. మూడేళ్లుగా ఇదే తంతు. చివరకు పాపం పడింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఇచ్చిన ఫిర్యాదుతో అమ్మాయి ముసుగులో మూడేళ్లుగా చేస్తున్న మోసం బయటపడింది. ఎందరినో నమ్మించి నట్టేట ముంచిన ఆ మోసగాడు ఇప్పుడు శ్రీ కృష్ణ జన్మస్థానానికి చేరాడు.

చదువులో గోల్డ్ మెడల్.. చోరీల్లో నెంబర్ వన్.. 13 ఏళ్లుగా అదే పనిచదువులో గోల్డ్ మెడల్.. చోరీల్లో నెంబర్ వన్.. 13 ఏళ్లుగా అదే పని

అసలు నిజం దాచి పెళ్లి

అసలు నిజం దాచి పెళ్లి

నెల్లూరుకు చెందిన శివమాధవ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. కొన్నేళ్ల క్రితం ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన శివ మాదాపూర్ లోని ఓ ఐటీ కంపెనీ హెచ్ ఆర్ విభాగంగా చేరాడు. హార్మోన్ల లోపం ఉన్న శివమాధవ్ గొంతు అచ్చం యువతి గొంతులాగే ఉంటుంది. స్వలింగ సంపర్కుడైన అతను ఆ విషయం దాచి నాలుగేళ్ల క్రితం ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లకే భార్యకు విషయం అర్థం కావడంతో కోర్టు మెట్లెక్కింది. విడాకుల కోసం భారీ పరిహారం డిమాండ్ చేయడంతో శివ మాధవ్ స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు తీసుకుని ఆ మొత్తం చెల్లించాడు. ఆ అప్పు తీర్చేందుకు ఇతరులను మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు.

అమ్మాయినని నమ్మించి

అమ్మాయినని నమ్మించి

డబ్బుల కోసం శివమాధవ్ డేటింగ్ సైట్లలో యువతి పేరుతో తన ఫోన్ నెంబర్ ఉంచాడు. అది చూసి తనకు కాల్ చేసిన వారితో అమ్మాయి గొంతుతో మాట్లాడి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సహా పలువురిని ఆకట్టుకున్నాడు. వారితో పరిచయం పెంచుకుని పలు సందర్భాల్లో పెద్ద మొత్తంలో నగదు తన అకౌంట్ లోకి ట్రాన్శ్ ఫర్ చేయించుకున్నాడు. ఇదే క్రమంలో శివ మాధవ్ కు ఏడాదిన్నర క్రితం బంజారాహిల్స్ కుచెందిన అభినవ్ పరిచయమయ్యాడు. ఇంజనీర్ అయిన అభినవ్ కు తన పేరు మేఘన అని చెప్పిన నిందితుడు ఫోన్ లో మాట్లాడటం మొదలుపెట్టారు. అభినవ్ ఫోటో పంపించాలని కోరడంతో శివ మాధవ్ ను బంధువుల అమ్మాయి ఫొటో పంపాడు.

పెళ్లి ప్రతిపాదన తెచ్చిన అభినవ్

పెళ్లి ప్రతిపాదన తెచ్చిన అభినవ్

ఫోన్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో అభినవ్ పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు. అందుకు అంగీకరించిన నిందితుడు.. ఇదే అదునుగా తన తండ్రి ఆరోగ్యం బాగాలేదని నమ్మించి లక్షల రూపాయలు తన ఖాతాకు ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. ఫిబ్రవరి 14 వాలైంటైన్స్ డే రోజున కలుసుకుందామని అభినవ్ కోరడంతో నిందితుడు తన సొంతూరైన నెల్లూరు రమ్మన్నాడు. ఈలోగా శివ మాధవ్ తన తల్లిదండ్రులకు విషయం చెప్పి అభినవ్ వస్తే వరుసకు చెల్లెలయ్యే అమ్మాయి ఫోటో చూయించమనడంతో వారు అలాగే చేశారు.

పెళ్లి చేసుకుంటానని రూ.45లక్షలకు టోకరా

పెళ్లి చేసుకుంటానని రూ.45లక్షలకు టోకరా

నిందితుడి తల్లిదండ్రులతో పెళ్లి విషయాలు మాట్లాడిన అభినవ్ మార్చి రెండోవారంలో పెళ్లి చేసుకుంటానని చెప్పి అందుకోసం 10లక్షల రూపాయలు వారికి ఇచ్చాడు. ఈ మొత్తంతో కలిపి అభినవ్ నిందితుడికి 45లక్షల రూపాయలు ట్రాన్శ్ ఫర్ చేశాడు. అనంతరం పెళ్లి పనుల గురించి మాట్లాడేందుకు అభినవ్ నిందితుడు శివ, అతని తల్లిదండ్రులకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది.

ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుని ఆచూకీ

ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితుని ఆచూకీ

తాను మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన అభినవ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. నిందితుడు తనకు పంపిన అమ్మాయి ఫోటోతో పాటు ఫోన్ నెంబర్లను పోలీసులకు ఇచ్చాడు. కేసు నమోదుచేసిన సైబర్ క్రైమ్ పోలీసులు ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టి శివమాధవ్ ను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడు అభినవ్ తో పాటు మరో యువకుడిని కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితున్ని కోర్టులో హారుపరిచిన పోలీసులు కోర్టు ఆదేశానుసారం జైలుకు పంపారు.

English summary
A Young Man cheated another man under the pretext of marry him. and took Rs. 45 lakhs. on receiving the complaints Hyderabad police arrested the accused and sent to jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X