హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొంప ముంచిన కొత్త పరిచయం.. అతన్ని గుడ్డిగా నమ్మి మోసపోయిన మహిళ.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా మోసాలు బాగా పెరిగిపోయాయి. సామాజిక మాద్యమాల్లో అమాయకులకు వల వేసి వారిని నిలువు దోపిడీ చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొదట చాటింగ్‌లు,ఫోన్ కాల్స్‌తో వారికి దగ్గరవడం... ఆ స్నేహాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి డబ్బులు దండుకోవడం... సోషల్ మీడియా మోసాల్లో ఇదే ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోనూ చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ వ్యక్తిని నమ్మి ఓ ఉద్యోగిని దారుణంగా మోసపోయింది.

అసలేం జరిగింది...

అసలేం జరిగింది...


పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌కు చెందిన షా గుప్తా అనే మహిళ ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గుప్తాకు కొన్నాళ్ల క్రితం నిల్సన్ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. తాను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నానని... ఉన్నత స్థానంలో ఉన్నానని నమ్మించాడు. ఆమె లాంటి స్నేహితురాలు దొరకడం తన అదృష్టం అన్నట్లుగా మాట్లాడాడు. అతని మాటలను ఆమె గుడ్డిగా నమ్మేసింది. దీంతో స్నేహం ముసుగు వేసుకుని ఆమె నుంచి అందినకాడికి దోచుకున్నాడు.

గిఫ్ట్ ప్యాక్ పేరుతో...

గిఫ్ట్ ప్యాక్ పేరుతో...


కొన్నాళ్ల పరిచయం తర్వాత... మన స్నేహానికి గుర్తుగా మీకేదైనా ఇవ్వాలనుకుంటున్నానని షా గుప్తాకు చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించడంతో... అమెరికా నుంచి కొన్ని డాలర్లు,బంగారు ఆభరణాలను పంపిస్తున్నానని చెప్పాడు. అలా డాలర్లు,బంగారం ఉన్న కొన్ని ఫేక్ ఫోటోలను ఆమెకు చెప్పాడు. తాను పంపిస్తున్న గిఫ్ట్ ప్యాక్‌లో ఇవన్నీ ఉన్నాయని... ఇప్పటికే వాటిని ఇండియాకు పంపించేశానని చెప్పాడు. దీంతో గిఫ్ట్ ప్యాక్ కోసం ఆమె ఆత్రుతగా ఎదురచూడసాగింది.

రూ.3.05లక్షలు కాజేశాడు...

రూ.3.05లక్షలు కాజేశాడు...

ఈ క్రమంలో ఓరోజు షా గుప్తాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము ఢిల్లీ విమానాశ్రయం నుంచి మాట్లాడుతున్నామని... మీకో పార్శిల్ వచ్చిందని అవతలి వ్యక్తి చెప్పాడు. అందులో విలువైన వస్తువులు ఉన్నాయని... అవి మీ ఇంటికి చేరాలంటే కస్టమ్స్ క్లియరెన్స్ చేయాలని చెప్పారు. పలానా అకౌంట్ నంబర్‌లో డబ్బులు వేయాలని చెప్పడంతో... ఆమె అలాగే చేసింది. నాలుగైదు దఫాలుగా వాళ్లు ఆ ఖాతాలో రూ. 3.05 లక్షలు జమ చేసింది. అయితే మరిన్ని క్లియరెన్సులు అవసరమని మరింత డబ్బు పంపించాలని ఫోన్లు రావడం మొదలైంది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

English summary
A woman approached ciber crime police on Wednesday in Hyderabad allegedly she was cheated by a man using social media platform.She lost almost Rs.3.50 lakhs to him,she alleged in her complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X