హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుడు మిస్సింగ్.. ఇంతకు ఏం జరిగిందంటే..!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణీకుడు అదృశ్యమయ్యారు. విదేశాల నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన క్రమంలో ఆయన మిస్ కావడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి సొంతగడ్డపై అడుగుపెట్టి ఇంటికి చేరుకోక ముందే ఈ ఘటన జరగడం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. మరో 15 రోజుల్లో అతడి వివాహం జరగనున్న నేపథ్యంలో స్వదేశానికి తిరిగొచ్చారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణీకుడు అదృశ్యమయ్యారనే వార్త అలజడి రేపింది. మంగళవారం నాడు రాత్రి లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రవీణ్ అనే యువకుడు కనిపించకుండా పోవడం చర్చానీయాంశమైంది. సొంతగడ్డపై అడుగు పెట్టగానే ఆయన అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది.

man Goes Missing At Shamshabad Airport hyderabad

ప్రేమించినోడిని పెళ్లి చేసుకుందని.. కూతురిని ఊరేగిస్తూ చితక్కొట్టిన తల్లిదండ్రులు..!ప్రేమించినోడిని పెళ్లి చేసుకుందని.. కూతురిని ఊరేగిస్తూ చితక్కొట్టిన తల్లిదండ్రులు..!

యూకే నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రవీణ్ అనే యువకుడు దమ్మాయిగూడ ప్రాంతంలోని తన నివాసానికి చేరుకునేందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే మార్గమధ్యంలో క్యాబ్ డ్రైవర్ దారి మళ్లించి అతడిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తన దగ్గరున్న రెండు లక్షల యూకే కరెన్సీతో పాటు గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకెళ్లినట్లు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తెలిపినట్లు సమాచారం.

అయితే తాను ఎక్కడ ఉన్నాననే విషయం అంతు చిక్కడం లేదని ప్రవీణ్ పేరెంట్స్‌కు చెప్పారట. ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నానని.. తాను ఉన్న సమీపంలో కొండపైన గుడి ఉందని కొన్ని ఆనవాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రవీణ్‌పై క్యాబ్ డ్రైవర్ దాడి చేశాడా.. లేదంటే మార్గమధ్యంలో ఎవరైనా అటాక్ చేశారా అనేది ప్రవీణ్ బయటకొస్తే గానీ అసలు నిజాలు బయటపడవు. ప్రవీణ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు ముమ్మరం చేశారు.

English summary
One Passenger Named Praveen Missing at Shamshabad airport Hyderabad. He Came from London to Home town. He booked Cab and went to his home in Dammaiguda. He didn't reached home, then called parents as he was attacked by some ones. The Family members filed a complaint in Police Station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X