• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అందమైన అమ్మాయికి ఎస్కార్ట్‌గా ఉంటారా? అంటూ భారీ మోసాలు.. షాకింగ్ నిజాలు చెప్పిన పోలీసులు

|

ఉచితంగా ప్రకటనలు ఇచ్చుకునే వీలున్న 'లొకెంటో' వెబ్‌సైట్‌ను చాలా మంది డేటింగ్‌ల కోసం వాడుకుంటోంటే.. ఇంకొందరు మాత్రం అక్రమంగా డబ్బులు సంపాదించడానికే వాడుకుంటున్నారు. 'లొకెంటో' వెబ్‌సైట్‌లో ''అందమైన అమ్మాయిలకు ఎస్కార్ట్ గా పనిచేస్తారా'' అనే యాడ్‌కు మీరు రెస్పాండ్ అయిఉండకపోవచ్చు.. కానీ హైదరాబాద్ సిటీలో దాన్నిబారినపడి డబ్బులు పోగొట్టుకుంటున్న యువత చాలా మందిఉన్నారు. ఈ తరహా నేరాలకు సంబంధించి సైబర్ క్రైమ్ విభాగం అధికారి ప్రసాద్ సంచలన విషయాలు చెప్పారు.

నెలకు రూ.25 వేల జీతం..

నెలకు రూ.25 వేల జీతం..

నాలుగు రోజుల కిందటే కవాడీగూడకు చెందిన ఓ 22ఏళ్ల స్టూడెంట్‌.. ‘లొకెంటో' వెబ్‌సైట్‌ లో ఎస్టార్ట్ ఉద్యోగం యాడ్ చూసి, సదరు కాంటాక్ట్ నంబర్ కు ఫోన్ చేశాడు. ముందుగా అమ్మాయిల ఫొటోలు పంపించి.. నచ్చిన అమ్మాయి దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామని.. జీతం నెలకు రూ.25వేలని, అమ్మాయికి ఎస్కార్ట్ గా ఉంటూ, ఆమె చెప్పిన పనులన్నీ చేయాల్సి ఉంటుందని ఫోన్ లో తెలిపారు. మొదటిగా రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.4వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఉద్యోగం ఇవ్వబోయే అమ్మాయితో అపాయింట్ మెంట్ ఖరారు చేశామని, తామే కారు కూడా పంపిస్తామని చెప్పారు.

మూడో స్టెప్ లో అమ్మాయి నుంచి మెసేజ్

మూడో స్టెప్ లో అమ్మాయి నుంచి మెసేజ్

ఫోన్ లో చెప్పినట్లే కవాడీగూడ స్టూడెంట్ దగ్గరికి కారు పంపారు.. కానీ కారు రిజిస్ట్రేషన్ పేరుతో ఇంకో రూ.4వేలు గుంజేశారు. కారులో కూర్చున్న వెంటనే.. అమ్మాయి పేరుతో ఓ మెసేజ్ వచ్చింది. ‘‘నేనెలా ఉంటానో ఫొటోలో చూశావుగా.. మరి ఒట్టిచేతులతో వస్తావా?''అని టీజ్ చేస్తూ కావాల్సిన వస్తువుల జాబితా పంపుతారు. అప్పటికప్పుడు వాటిని ఎక్కడ కొనాలో తెలియక తికమకపడ్డ ఆ విద్యార్థి.. మళ్లీ మొదటి వ్యక్తికే ఫోన్ చేసి.. అమ్మాయితో చాటింగ్ సారాంశాన్ని వివరించాడు. ‘‘సరే వాటిని నేనే ఎరేంజ్ చేస్తాను.. ఓ 10వేల పంపు..''అని సమాధానం వస్తుంది. ఈలోపే మనం దిగాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది..

ఉత్సాహంతో కారు దిగి...

ఉత్సాహంతో కారు దిగి...

బూతు మెసేజ్ లు, హాట్ ఫొటోలతో చాటింగ్ లతో ఉద్రేకానికి గురిచేశారని, ఫలానా చోట దిగిన వెంటనే.. కారు తుర్రున వెళ్లిపోయిందని, అక్కణ్నుంచి ఎటు వెళ్లాలో తెలియక మళ్లీ ఫోన్ చేస్తే.. రెండు నంబర్లూ స్విచాఫ్ అయి ఉన్నాయని, కొద్దిసేపటికిగానీ తాను మోసపోయిన విషయం అర్థంకాలేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

కుట్రదారు దుర్గాప్రసాద్ అరెస్ట్..

కుట్రదారు దుర్గాప్రసాద్ అరెస్ట్..

బాధితుడి ఫిర్యాదు మేకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు.. ‘లొకెంటో' వెబ్‌సైట్‌ లో ‘అమ్మాయిలకు ఎస్కార్ట్‘ ప్రకటన ఇచ్చిన వ్యక్తిని దుర్గాప్రసాద్ గా గుర్తించారు. అతను సిటీ శివారులోని దమ్మాయిగూడలో ఉంటున్నట్లు కనిపెట్టారు. చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.

మూడు ఫోన్లతోనే ఇదంతా..

మూడు ఫోన్లతోనే ఇదంతా..

నిజానికి దుర్గా ప్రసాద్ దగ్గర అమ్మాయిలెవరూ లేరని, ఇంటర్నెట్, సోషల్ మీడియాలో కినిపించే అందమైన అమ్మాయిల ఫొటోలనే ఎరగా వాడి మోసాలకు పాల్పడుతున్నాడని సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. ‘‘మూడు ఫోన్లతో దుర్గాప్రసాద్ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నాడు. ఇప్పటిదాకా సుమారు 10 మందిని మోసం చేశాడు. ఒక్కో బాదితుడి నుంచి 20 నుంచి 30వేల దాకా వసూలు చేశాడు. ‘లొకెంటో' వెబ్‌సైట్‌లోగానీ, ఇంటర్నెట్ లో కినిపించే ఇతర ప్రకటనల పట్లగానీ యువత అప్రమత్తంగా ఉండాలి''అని అధికారి ప్రసాద్ తెలిపారు. నిందితుడు దుర్గాప్రసాద్ ను రిమాండ్ తరలించామన్నారు.

English summary
hyderabad cyber crime police arrested a man named durga prasad for cheating 22 year old student of kavadiguda for online cheating. through Locanto website the accused offers fake jobs and collecting huge money
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more