మొదటి భార్యను మరిచిపోలేక.. రెండో భార్యతో కొట్లాట.. చివరకు రెండు ప్రాణాలు..!
హైదరాబాద్ : మనస్పర్థలు మనుషుల మధ్య దూరం పెంచుతున్నాయి. భార్యాభర్తల మధ్య అగాధాలు సృష్టిస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో బంధాలు తెంచుకుంటున్నారు. ప్రాణాలు తీసుకునేలా ప్రవర్తిస్తున్నారు. పచ్చని పందిరిలో బాసలెన్నో చేసి కట్టుకున్నోళ్లను కడతేర్చే విష సంస్కృతి నానాటికీ పెరుగుతోంది. భర్త మీద కోపంతో భార్య.. భార్య మీద అలిగి భర్త.. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు కొకొల్లలు. అయితే హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన స్థానికంగా విషాదం నింపింది. మొదటి భార్యను మరిచిపోలేని ఓ భర్త రెండో భార్యను కిరాతకంగా చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు.

హైదరాబాద్‌లో దారుణం.. రెండో భార్యను కిరాతకంగా చంపి..!
హైదరాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యను భర్త కిరాతకంగా చంపిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఇందిరమ్మ నగర్‌కు చెందిన వెంకటేశ్‌కు ఇటీవల స్వప్న అనే యువతితో పెళ్లి జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహ వేడుక జరిపించారు స్వప్ప తల్లిదండ్రులు. అయితే వారు అన్యోన్యంగా ఉంటారని భావిస్తే.. ఆ బంధం మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మూడు నెలల కిందట స్వప్నను పెళ్లి చేసుకున్న వెంకటేశ్ బుధవారం (23.10.2019) నాడు ఆమెను అతి కిరాతకంగా చంపాడు.
అమ్మ అడిగిందని స్కూటర్‌పై.. కారు ఇస్తానంటూ ఆనంద్ మహీంద్రా ఆఫర్..!

రెండో భార్యతో గొడవ.. మొదటి భార్యను మరిచిపోలేక..!
మూడు నెలల కిందట స్వప్నను రెండో వివాహం చేసుకున్నాడు వెంకటేశ్. 15 ఏళ్ల కిందట మరో మహిళతో వివాహం జరిగింది. అయితే ఏవో కారణాలతో ఆమె చనిపోవడంతో ఇటీవల స్వప్నను రెండో భార్యగా స్వీకరించాడు. అదలావుంటే గతాన్ని మరిచిపోలేక.. మొదటి భార్యను పదే పదే గుర్తు చేస్తూ చీటికిమాటికీ రెండో భార్య స్వప్నతో గొడవ పడేవాడు. ఆ క్రమంలో ఇటీవల ఇద్దరి మధ్య తగాదాలు బాగా పెరిగిపోయాయి. ఎవరూ తగ్గకుండా ఇద్దరూ కూడా ఘర్షణ పడేవారు. అలా మొదటి భార్య కారణంగా వీరి కాపురంలో మనస్పర్థలు తలెత్తి చివరకు ఇద్దరి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది.

ఇద్దరి మధ్య గొడవ.. చివరకు ప్రాణాలు..!
అదే క్రమంలో బుధవారం నాడు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వెంకటేశ్ పదే పదే మొదటి భార్యను గుర్తు చేస్తుండటంతో రెండో భార్య స్వప్న తట్టుకోలేక పోయింది. అలా ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దాంతో కోపం పట్టలేకపోయిన వెంకటేశ్.. స్వప్న మెడకు తాడు బిగించి ఉక్కిరి బిక్కిరి చేశాడు. అనంతరం అతి కిరాతకంగా ప్రవర్తించాడు. వంట గదిలోకి వెళ్లి రోకలి బండ తీసుకొచ్చి తలపై మోదాడు. దాంతో స్వప్నకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయింది.
ఒడ్డుకు చేరిన వశిష్ట.. మరి రమ్యశ్రీ ఎక్కడ.. కుటుంబ సభ్యుల కన్నీరు

క్షణికావేశంలో రెండో భార్యను చంపి.. తాను కూడా సూసైడ్
మొదటి భార్య జ్ఞాపకాలు గుర్తుకు రావడం.. క్షణికావేశంలో రెండో భార్యను చంపడం.. ఇదంతా కూడా వెంకటేశ్ జీర్ణించుకోలేక పోయాడు. రెండో భార్యను చంపిన క్రమంలో తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. చివరకు తాను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. అయితే ఇద్దరూ చనిపోయిన విషయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వెంకటేశ్, స్వప్న ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!