హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కలికాలం: అమ్మాయిలే కాదు అబ్బాయిలకు రక్షణ లేదు.. సిలిండర్ తీసుకొద్దామని తీసుకెళ్లి బాలుడిపై అత్యాచారం

|
Google Oneindia TeluguNews

గోల్కొండ : కామాంధులు రెచ్చిపోతున్నారు. కామవాంఛ తీర్చుకునేందుకు అమ్మాయిల్నే కాదు.. అబ్బాయిలను వదలడం లేదు. ఇలాంటి ఘటన హైదరాబాద్‌లోని గోల్కొండ ప్రాంతంలో జరిగింది. ఇంట్లో ఏదో పని ఉందని పొరుగింట్లో ఉండే బాలుడిని పిలిచిన ఓ వ్యక్తి అతనిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దుర్మార్గుడు చేసిన పనితో బెదిరిపోయిన బాధితుడు తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

గోల్కొండ జిన్సీ బజార్‌కు చెందిన హర్షద నదీమ్ ప్రైవేట్ ఉద్యోగి. అతని ఇంటి పక్కనే 14ఏళ్ల బాలుడు ఉంటున్నాడు. సిలిండర్ తీసుకువచ్చే పని ఉందని నదీమ్ సదరు బాలుడిని ఇంటికి పిలిచాడు. కామంతో కళ్లు మూసుకుపోయి ఆ బాలుడిపై అత్యాచారం చేశారు. విషయం ఎవరికీ చొప్పొద్దని డబ్బు ఇంటి ఇంటి వద్ద వదిలేశాడు.

Man raped 14year boy in hyderabad

బాలుడు కనిపించక మూడు గంటలు కావడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. సాయంత్రానికి ఇంటికి తిరిగొవచ్చిన అబ్బాయి బెదిరిపోయి కనిపించడంతో తల్లిదండ్రులు విషయం ఆరా తీశారు. దీంతో నదీమ్ తనపై చేసిన అఘాయిత్యాన్ని వారికి చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు గోల్కొండ పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు హర్షద్ నదీమ్‌పై పోక్సో చట్టం కింద అర్షద్ నదీమ్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం బాలుడిని హాస్పిటల్‌కు పంపారు.

English summary
A case has been registered in golconda police station against a person who raped 14 year boy. Harshad nadeem who works is a private employee called boy to his home and raped him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X