హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగారెడ్డికి షిఫ్ట్ అయిన మంచు మనోజ్ .. అధికారులా మజాకా

|
Google Oneindia TeluguNews

Recommended Video

మంచు మనోజ్ కి నారాయణఖేడ్ లో నమోదైన ఓటు హక్కు || Manchu Manoj Shifted To Sangareddy || Oneindia

సినీ హీరో,మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ అడ్రస్ మారిందా? హైదరాబాదులోని ఫిలిం నగర్లో నివాసం ఉండే మనోజ్ సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ కు ఎందుకు షిఫ్ట్ అయ్యాడు? మంచు మనోజ్ ఓటు హక్కు సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ లో ఎందుకుంది ? అసలేం జరుగుతుంది అని ఆలోచిస్తున్నారా ?

చెప్పు తెగేలా కొట్టినా మారని అధికారి.. మహిళా డాక్టర్ ను ఎలా వేదిస్తున్నాడో తెలుసా ?చెప్పు తెగేలా కొట్టినా మారని అధికారి.. మహిళా డాక్టర్ ను ఎలా వేదిస్తున్నాడో తెలుసా ?

సంగారెడ్డి జిల్లాలో మంచు మనోజ్ కు ఓటు హక్కు

సంగారెడ్డి జిల్లాలో మంచు మనోజ్ కు ఓటు హక్కు

మంచు మనోజ్... మోహన్ బాబు తనయుడిగా, సినీ హీరోగా సినీ పరిశ్రమలో క్రేజ్ సంపాదించిన హీరో. ఫిలింనగర్ లో నివాసముండే మంచు మనోజ్ కు నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు హక్కు నమోదైంది. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇవి అధికారుల లీలలని ఈ విష్యం తెలిసిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మంచు మనోజ్ కే తెలీకుండా ఈ ఓటరు గుర్తిపు కార్డు రావటం గమనార్హం. అధికారులు అడ్డగోలుగా ఎలా పడితే అలా ఓటరు గుర్తింపు కార్డులు ఇస్తున్నారు అన్న విషయం మంచు మనోజ్ ఓటు హక్కు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో ఉన్నట్లుగా గుర్తించడంతో తెలిసింది. ఇక ఓటరు నమోదులో జరుగుతున్న డొల్లతనం ఈ ఘటనతో బయటపడింది.

 నారాయణ్ ఖేడ్ లో మంచు మంజో కు ఓటరు జాబితాలో స్థానం .. బీజేపీ సీరియస్

నారాయణ్ ఖేడ్ లో మంచు మంజో కు ఓటరు జాబితాలో స్థానం .. బీజేపీ సీరియస్

దీనిపైన బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు హక్కు నమోదు కావడంపై వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కలెక్టర్ సీరియస్ గా ఉన్నారు. దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

నారాయణఖేడ్ మున్సిపాలిటీ లోని రెండో వార్డులో 2- 25 నెంబర్ గల ఇంట్లో మంచు మనోజ్ ఉంటున్నట్లుగా ఆయనకు ఓటు హక్కు కల్పించారు .ఇక ఓటరు జాబితాలో 428 నెంబర్ తో ఈ ఓటు హక్కును కల్పించడం కనిపిస్తుంది. ఒక మంచు మనోజ్ పేరే కాదు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు పేరు కూడా ఈ జాబితాలో ఉంది.

 మనోజ్ ఓటుహక్కు పై కలెక్టర్ సీరియస్ ... ఎమ్మార్వో వివరణ కోరిన కలెక్టర్

మనోజ్ ఓటుహక్కు పై కలెక్టర్ సీరియస్ ... ఎమ్మార్వో వివరణ కోరిన కలెక్టర్

ఓటరు జాబితాను పరిశీలించిన స్థానిక బిజెపి నేతలు, ఇక ఈ ఓట్ల విషయంలో అధికారులను నిలదీశారు. అధికారులు స్పందించారు.
ఓటర్ లిస్ట్‌పై జిల్లా కలెక్టర్ హన్మంత్ రావు విచారణకు ఆదేశించారు. ఓటర్‌గా సినీ హీరో మంచు మనోజ్ పేరుతో ఓటరు గుర్తింపు కార్డు రావడంపై నారాయణ ఖేడ్ ఎమ్మార్వోను లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరారు కలెక్టర్. ఇందుకు బాధ్యులైన ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

English summary
Officers in Narayankhed are criticized for not taking the matter seriously pertaining to the registration of election details of the individuals. Recently, the name and photograph of the actor Manchu Manoj, son of veteran actor Manchu Mohan Babu has surfaced in a voter card representing Sangareddy district. This has shocked many apart from such details of other persons. Though the local people including the opposition party members asked the Tahsildar of the concerned revenue division to correct the same, it is yet to be corrected. The actor has also kept quiet, it is learned. Maybe the actor is well aware of the irresponsible approach of the concerned officials. On the other hand, people have been expressing their concerns over such irregularities as municipality elections will take place next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X