హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుజరాత్, మహారాష్ట్రలో ప్రజల ఆకలి కేకలు, ఆదుకోవాలని కేసీఆర్‌ను కోరిన ఆర్ కృష్ణయ్య

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. పొట్ట కూటి కోసం అక్కడ పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. తెలంగాణ వాళ్లు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్‌లో ఉన్నారు. అక్కడున్న వారికి కనీసం ఆహారం కూడా దొరకని పరిస్థితి. ఆపత్కాలంలో సీఎం కేసీఆర్ కల్పించుకొని.. ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి తగిన చర్యలు తీసుకోవాలని బీసీ నేత ఆర్ కృష్ణయ్య కోరారు.

లాక్‌డౌన్‌తో గుజరాత్, మహారాష్ట్రలో తెలంగాణ వారికి ఆహారం కూడా దొరకడం లేదన్నారు ఆర్ కృష్ణయ్య. వారు ఆకలితో అలమటిస్తున్నారని.. వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలు సహా.. అధికారులతో కేసీఆర్ మాట్లాడాలని కోరారు. దీంతోపాటు వారికి భోజనం, వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే వారి పరిస్థితి దయనీయంగా మారుతోందని చెప్పారు.

 many people struggle in gujarat, maharashtra: r krishnaiah

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం వరకు 41 ఉన్న పాజిటివ్ కేసులు.. గురువారానికి 44కి చేరింది. అందులో ఇద్దరు వైద్యులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మరోకరు కుత్బుల్లాపూర్‌కి చెందిన వ్యక్తి ఉన్నారు. లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉన్న పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రభుత్వం ఆందోళనకు గురవుతోంది.

English summary
many telangana state people struggle in gujarat, maharashtra.. please help those people r krishnaiah ask cm kcr.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X